AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: రోజు రోజుకు గీతూ పిచ్చి చేష్టలు ఎక్కువవుతున్నాయిగా.. ఈసారి బాలాదిత్యను ఇలా

హౌస్ లో ఏడుపులు, గొడవలు, అల్లర్లతో నానా రచ్చ చేస్తున్నారు. అందరికంటే గీతూ చేస్తున్న ఓవర్ యాక్షన్ మాత్రం జనాలకు తలనొప్పి తెప్పిస్తోంది. రోజు రోజుకు ఈ అమ్మాయి చేసే ఓవర్ యాక్షన్ ను చూడలేక జనాలు ఏందిరా స్వామీ అనుకుంటున్నారు.

Bigg Boss 6 Telugu: రోజు రోజుకు గీతూ పిచ్చి చేష్టలు ఎక్కువవుతున్నాయిగా.. ఈసారి బాలాదిత్యను ఇలా
Bigg Boss Geethu
Rajeev Rayala
|

Updated on: Oct 13, 2022 | 4:02 PM

Share

బిగ్ బాస్ సీజన్ సిక్స్ మంచి రసవత్తరంగా సాగుతుంది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి హౌస్ లో ఉన్న వారంతా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళను చూడటానికి జనాలు కూడా అంతే కష్టపడుతున్నారు. హౌస్ లో ఏడుపులు, గొడవలు, అల్లర్లతో నానా రచ్చ చేస్తున్నారు. అందరికంటే గీతూ చేస్తున్న ఓవర్ యాక్షన్ మాత్రం జనాలకు తలనొప్పి తెప్పిస్తోంది. రోజు రోజుకు ఈ అమ్మాయి చేసే ఓవర్ యాక్షన్ ను చూడలేక జనాలు ఏందిరా స్వామీ అనుకుంటున్నారు. మరోసారి కూడా గీతూ తన నోటితో దురుసుతో ఆదిత్యను హార్ట్ చేసింది. ఈ వరం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా హౌస్ లో ఉన్నవారికి టాస్క్ ఇచ్చాడు. హౌస్ మేట్స్ కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీని రీచర్జ్ చేసుకోవాలంటే హౌస్ లో ఉన్న సభ్యులు భోజనం మానేయాలని అన్నారు. అలాగే మరో ఆప్షన్ కూడా ఇచ్చాడు బాలాదిత్య సిగిరెట్లను త్యాగం చేయాల్సి ఉంటుందని అన్నారు.

అయితే ఈ విషయాన్నీ గీతూ చెప్తూ.. అసలే పెద్దదైన తన నోటితో ఇంకా గట్టిగా అరుస్తూ.. బాలాదిత్య పూర్తిగా సిగిరెట్లు మానెయ్యాలి అంటూ చెప్పుకొచ్చింది. దాంతో బాలాదిత్య హార్ట్ అయ్యాడు. గీతూ దగ్గరకు వెళ్లిఇదే పని స్ట్రయిట్ గా నా దగ్గరకు వచ్చి చెప్పుంటే ఇంకా అందంగా ఉండేది అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆతర్వాత బాలాదిత్య సిగెరెట్స్ తాగకుండా ఉండేలా కెప్టెన్ చూసుకోవాలని అన్నారు.

దాంతో రేవంత్ పిల్లి పిల్లి కొట్టుకుంటే మధ్యలో కొత్తఎత్తుకెళ్లిందన్నట్టు  నాకెంటిది అంటూ అనుకున్నాడు. అయితే బాలాదిత్యకి స్మోకింగ్ అలవాటు ఉంది. చలాకీ చంటితో కలిసి.. ఈ ఇద్దరూ స్మోక్ చేశేవారు. అయితే చంటి ఎలిమినేషన్ తరువాత ఆదిత్య ఒక్కడే స్మోక్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇక అంతకు ముందు నాకు కుక్క బొచ్చు కావాలి.. ఆడియో కాల్ కావాలని అడిగింది.. ఫోన్ కట్టైనా మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చింది గీతూ.. ఆ తరువాత ఆమె యాటిట్యూడ్ బయటకు వచ్చి చేసిన పిచ్చి చేష్టలు ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయనే చెప్పాలి. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో చివరగా బ్యాటరీ రీఛార్జ్ అవ్వాలంటే రోహిత్ కానీ వాసంతి కానీ ఇద్దరిలో ఒకరు డైరెక్ట్ గా నామినేట్ అవ్వాలని చెప్పాడు. దానికి రోహిత్ నేనే నామినేట్ అవుతా అని తెలిపాడు. దాంతో బ్యాటరీ 100 శాతం రీఛార్జ్ అయ్యింది. ఇక మిగిలిన వారు తమ ఇంట్లో వాళ్లతో ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ మాట్లాడారు. అలాగే రేవంత్ కోసం ఇంటి నుంచి ఒక గిఫ్ట్ ను కూడా పంపాడు బిగ్ బాస్ దాంతో రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ఫైమా తన తల్లితో వీడియో కాల్ మాట్లాడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!