Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‏తో అలాంటి పాత్రనా.. ? రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్.. చివరకు..

నీలికళ్లు.. అందమైన రూపంతో వెండితెరపై చక్రం తిప్పిన హీరోయిన్ ఐశ్వర్య రాయ్. హందీ, తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్.. ఇప్పుుడు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఐశ్వర్య నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‏తో అలాంటి పాత్రనా.. ? రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్.. చివరకు..
Aishwarya Rai

Updated on: Oct 07, 2025 | 10:03 AM

ఐశ్వర్యరాయ్.. సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. హిందీ, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఐశ్వర్య కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ ప్రియురాలు పిలిచింది. 2000వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో వచ్చిన కండుకొండైన్ కండుకొండైన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన మూవీ ఇది. ఇందులో మమ్ముట్టి, అజిత్, టబు, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నలుగురు తమ నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

తాజాగా ఈ మూవీ డైరెక్టర్ రాజీవ్ మేనన్ ఈ సినిమాకు సంబంధించిన రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే ఇందులో మమ్ముట్టి పాత్రను చాలా మంది స్టార్స్ రిజెక్ట్ చేశారని అన్నారు. ఇందులో ఐశ్వర్య రాయ్ కు జంటగా మమ్ముట్టి నటించిన సంగతి తెలిసిందే. యుద్ధంలో కాలు కోల్పోయిన మేజర్ బాలా పాత్రకు ఆయన ప్రాణం పోశారు. అయితే ఈ పాత్రను చేయడానికి ముందుగా ఎవరు అంగీకరించలేదట. ఆ పాత్ర గొప్పతనమంతా అతడి నడకలోనే ఉంటుందని.. కానీ కాలు కోల్పోయిన వ్యక్తిగా నటించేందుకు ఎవరూ ఒప్పుకోలేదట. కాలు లేని పాత్రలో నటించడం మాకు ఇష్టం లేదని ముఖం మీదే చెప్పేశారట. చివరకు ఈ రోల్ గురించి చెప్పగానే మమ్ముట్టి వెంటనే అంగీకరించారని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

2000లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డుతోపాటు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సైతం సొంతం చేసుకున్నారు. ఇందులో సాంగ్స్ సూపర్ హిట్. ఇప్పటికీ సోషల్ మీడియాతోపాటు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?