RRR Movie: విశ్వవేదికపై ‘ఆర్ఆర్ఆర్’ సెన్సెషన్.. ఏకంగా నాలుగు కేటగిరీల్లో హెచ్‏సీఏ అవార్డ్స్..

|

Feb 25, 2023 | 10:42 AM

అలాగే మరో మూడు కేటగిరిలలోనూ గెలుపొందింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం, బెస్ట్ యాక్షన్ ఫిలిం, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్టంట్స్ కేటగిరీల్లో ఈ సినిమా హెచ్ సీఏ అవార్డ్స్ వరించాయి.

RRR Movie: విశ్వవేదికపై ఆర్ఆర్ఆర్ సెన్సెషన్.. ఏకంగా నాలుగు కేటగిరీల్లో హెచ్‏సీఏ అవార్డ్స్..
Rrr
Follow us on

అంతర్జాతీయ వేదికపై ట్రిపుల్ ఆర్ సత్తా చాటుతుంది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ డ్రామా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని మరో అవార్డ్ వరించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డులలో ప్రధానోత్సవంలో పలు విభాగాల్లో గెలిచింది. బెస్ట్ యాక్షన్ మూవీ అవార్డును సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. అలాగే మరో మూడు కేటగిరిలలోనూ గెలుపొందింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం, బెస్ట్ యాక్షన్ ఫిలిం, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్టంట్స్ కేటగిరీల్లో ఈ సినిమా హెచ్ సీఏ అవార్డ్స్ వరించాయి.

ఈ అవార్డులను అమెరికాలో రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ అందుకున్నారు. కాగా బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా హెచ్ సీఏ అవార్డ్స్ కోసం నామినేట్ అయ్యింది. హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులలో పలు విభాగాల్లో విదేశీ చిత్రాలను వెనక్కు నెట్టి మరీ తెలుగు సినిమా విజయాన్ని అందుకుంది. కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు హెచ్ సీఏ స్పాట్ లైట్ అవార్డును సైతం దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

ఆర్ఆర్ఆర్ సినిమా బెస్ట్ స్టంట్స్ అవార్డును అందించిన హెచ్ సీఏ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు రాజమౌళి. ఎంతో శ్రమించి ఇందులో స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్, క్లైమాక్స్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు కంపోజ్ చేసిన జూజీతోపాటు.. మా సినిమా కోసం భారత్ కు వచ్చి.. మా విజన్ అర్ధం చేసుకుని మాకు అనుగుణంగా మారి కష్టపడి పనిచేసిన ఇతర స్టంట్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు..సినిమాలోని రెండు , మూడు షార్ట్స్ లో మాత్రమే డూప్స్ ను ఉపయోగించామని… మిగతావన్ని ఎన్టీఆర్, రామ్ చరణ్ స్వయంగా చేశారని..వారిద్దరూ అద్భుతమైన వ్యక్తులు.. 320 రోజులపాటు ఈ సినిమాను షూటింగ్ చేయగా.. అందులో ఎక్కువ భాగం స్టంట్స్ కోసమే పనిచేశామని.. ఇది మా సినిమాకు దక్కిన అరుదైన గౌరమని అన్నారు రాజమౌళి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.