SSMB 29 : మహేష్ ఫ్యాన్స్‏కు మరో సర్‌ప్రైజ్‌.. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో పై జక్కన్న మరో పోస్ట్..

మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా SSMB 29. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న సినిమా ఇదే. హాలీవుడ్ స్థాయిలో ఓ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొంది. #GlobeTrotter (వర్కింగ్‌ టైటిల్‌)గా రానున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

SSMB 29 : మహేష్ ఫ్యాన్స్‏కు మరో సర్‌ప్రైజ్‌.. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో పై జక్కన్న మరో పోస్ట్..
SSMB 29 Globetrotter Event

Updated on: Nov 15, 2025 | 4:09 PM

ప్రస్తుతం భారతీయ సినీప్రియులు అందరి చూపు #GlobeTrotter ఈవెంట్ పైనే ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB 29 (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లో ఈ ఈవెంట్ స్టార్ట్ కానుంది. దీంతో ఇప్పటికే వేదిక వద్దకు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో మహేష్ ఫ్యాన్స్ కు మరో క్రేజీ న్యూస్ చెప్పారు జక్కన్న.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

ప్రస్తుతం గ్లోబ్ ట్రోటర్ వేడుకలో సినిమాకు సంబంధించిన టైటిల్, మహేష్ బాబు పోస్టర్ రివీల్ చేయనున్నారు. అలాగే ఈ వేడుకలో మరో సర్ ప్రైజ్ ఉంటుందట. అదేంటంటే.. ఈ వేడుకలో టైటిల్ తోపాటు సినిమాకు సంబంధించిన ప్రపంచాన్ని సైతం పరిచయం చేస్తూ విజువల్స్ కూడా వస్తాయని తెలిపారు. ఈ వేడుకలో ఏర్పాటు చేసిన 100 అడుగుల స్క్రీన్ పై ప్రదర్శించిన అనంతరం ఆన్ లైన్ వేదికగానూ ఈ విజువల్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాతోపాటు మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం కీలకపాత్రలు పోషిస్తున్నారు. మందాకిని పాత్రలో ప్రియాంక, కుంభగా పృథ్వీరాజ్ నటించనున్నట్లు తెలియజేస్తూ వారిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు జక్కన్న. ఇక ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ వేడుకలో మహేష్ బాబు లుక్, ఆయన పేరును వెల్లడించాల్సి ఉంది.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..