Rajamouli: ‘ఏం జరిగినా నాకు ఏదో గుణపాఠం చెబుతోంది.. నువ్వు నా క్లాస్‏రూమ్’.. రాజమౌళి ఎమోషనల్ ట్వీట్..

|

Jul 28, 2023 | 8:34 AM

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు అపజయమెరుగని డైరెక్టర్ రాజమౌళి. ఆయన తెరకెక్కించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా.. నటీనటులకు ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచాయి. సినిమాలతో తనకున్న అనుబంధాన్ని ఏదో ఒకరూపంలో వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో వేదికగా మరోసారి సినిమా అంటే తనకెంత ఇష్టమో తెలియజేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

Rajamouli: ఏం జరిగినా నాకు ఏదో గుణపాఠం చెబుతోంది.. నువ్వు నా క్లాస్‏రూమ్.. రాజమౌళి ఎమోషనల్ ట్వీట్..
Rajamouli
Follow us on

ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు కేవడం పాన్ ఇండియా కాదు.. హాలీవుడు మొత్తం టాలీవుడ్ మూవీస్ పై ఆసక్తి చూపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు అపజయమెరుగని డైరెక్టర్ రాజమౌళి. ఆయన తెరకెక్కించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా.. నటీనటులకు ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచాయి. సినిమాలతో తనకున్న అనుబంధాన్ని ఏదో ఒకరూపంలో వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో వేదికగా మరోసారి సినిమా అంటే తనకెంత ఇష్టమో తెలియజేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

హైదరాబాద్‏లో సినీ ప్రియులకు మల్టీపెక్స్ ప్రసాద్ ఐమాక్స్ గురించి పరిచయం అవసరం లేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో అనగానే అందరికి గుర్తొ్చ్చే పేరు ప్రసాద్ ఐమాక్స్. తెలుగు చిత్రపరిశ్రమలోనే ఈ మల్టీప్లెక్స్ ప్రయాణానికి ఓ చరిత్ర ఉంది. కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే అక్కడ జాతరే. ఈ మల్టీప్లెక్స్ స్థాపించి ఇరవై ఏళ్లవుతోంది. ఈ సందర్బంగా రాజమౌళి ఓ వీడియోను షేర్ చేస్తూ ప్రసాద్ మల్టీప్లెక్స్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఇవి కూడా చదవండి

“ఎన్ని శుక్రవారాలు..ఫస్ట్ డే ఫస్ట్ షోలు.. ఉదయాన్నే 8.45కి సీట్లో కూర్చోవడానికి పరుగెత్తుకుంటూ రావడం.. ఇప్పటికే 20 ఏళ్లయిందా ??.. ప్రతి సినిమా వినోదాత్మకంగా ఉన్నా, నిరాశపరిచినా నాకు గుణపాఠం చెబుతోంది. ప్రియమైన ప్రసాద్ ఐమాక్స్.. మీరు సినిమా మాత్రమే కాదు, మీరు నా తరగతి గది కూడా.. ధన్యవాదాలు.. అన్ని భావోద్వేగాలను చిత్రీకరించిన వీడియోకు ప్రత్యేక ప్రస్తావన..” అంటూ ట్వీట్ చేశారు జక్కన్న.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.