ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో డాకు మహారాజ్ ఒకటి. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఈ చిత్రం ఈరోజు అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీకి ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బాలయ్య యాక్టింగ్.. అందుకు తగినట్లుగా డైరెక్టర్ బాబీ ఇచ్చిన ఎలివేషన్స్, మేకింగ్ చూస్తే సినిమా అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు తమన్ అందించిన ఆర్ఆర్ హైలెట్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ డాకు మహారాజ్ మూవీపై ఆసక్తికర ట్వీట్ చేశాడు.
“డాకుకు మంచి రెస్పాన్స్ వస్తోందని వింటున్నాను. త్వరగా చూడాలని కోరుకుంటున్నాను. ప్రోమో, టీజర్, ట్రైలర్ లోనే బాలయ్య ప్రజెన్స్ అదిరిపోయింది. బాలయ్యని బాబీ కొత్త అవతారంలో చూపించారు. బాలయ్యతో తమన్ కాంబో అంటే అదిరిపోవాల్సిందే. వంశీ కంటిన్యూగా హిట్లు కొడుతూనే ఉన్నాడు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం కార్తీకేయ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.
డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
#DaakuMaharaaj 🔥🔥. Hearing amazing responses already and cant wait to watch it…. 🤗🤗#Balakrishna garu looks majestic in the promos presented by @dirbobby in a new avatar!! @MusicThaman you’re everywhere and ur combo with NBK garu always strikes gold ❤️❤️❤️
And @vamsi84…
— S S Karthikeya (@ssk1122) January 12, 2025
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..