AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB 29 :ఇదెక్కడి మాస్ పోస్టర్ మావ.. మందాకినిగా ప్రియాంక చోప్రా.. జక్కన్న దుమ్మురేపాడుగా..

ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్, సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు SSMB 29. ఇది వర్కింగ్ టైటిల్.. కానీ మరో మూడు రోజుల్లో ఈ సినిమా పేరు విడుదల చేయనున్నారు. అలాగే ఘట్టమనేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. దీంతో జక్కన్న సృష్టించబోయే మ్యాజిక్ ఏంటా అని ఎదురుచూస్తున్నారు.

SSMB 29 :ఇదెక్కడి మాస్ పోస్టర్ మావ.. మందాకినిగా ప్రియాంక చోప్రా.. జక్కన్న దుమ్మురేపాడుగా..
Ssmb29
Rajitha Chanti
|

Updated on: Nov 12, 2025 | 8:55 PM

Share

ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ SSMB 29. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచస్థాయిలో చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ రేంజ్ లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు 120 దేశాల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ రివీల్ చేసే సమయం ఆసన్నమైంది. నవంబర్ 15నఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఉండనుంది.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించనుంది చిత్రయూనిట్. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి రోజుకో అప్డేట్ షేర్ చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ షేర్ చేయగా.. ఇటీవల మహేష్ పాత్ర గురించి తెలుపుతూ శ్రుతిహాసన్ పాడిన పాటను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు.

ఈ సినిమాలో ఆమె మందాకిని అనే పాత్రలో కనిపించనున్నారు. ‘And now she arrives… Meet MANDAKINI’ (ఆమె వస్తోంది… ఆమే మందాకిని) అనే క్యాప్షన్‌తో దర్శకుడు రాజమౌళి తన ఇన్ స్టాలో పంచుకున్నారు. ఈ పోస్టర్ లో ప్రియాంక చోప్రా.. చీరకట్టులో.. హీల్స్ ధరించి.. చేతిలో పిస్టల్ తో ఎంతో డైనమిక్ గా.. పవర్ ఫుల్ గా కనిపిస్తూ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశారు. ఈ పోస్టర్ విడుదలైన క్షణాల్లో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై మరింత హైప్ పెరిగింది.

View this post on Instagram

A post shared by SS Rajamouli (@ssrajamouli)

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..