అల్ఐలుకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా నటిస్తూ బ్రిలియంట్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న చిత్రం ఇది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా సునీల్, ఫహాడ్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్ర పోషిస్తూ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన నాలుగు పాటలు కూడా ఎంతో వేగంగా ప్రేక్షకుల మన్నన పొందాయి.
ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై నగరాలలో జరిగిన ఈ చిత్ర ఈవెంట్లకు ప్రేక్షకుల నుండి అపారమైన రెస్పాన్స్ రావడం జరిగింది. కాగా ఇప్పుడు హైదరాబాదులో ఈ చిత్ర ఈవెంట్ జరుగుతుండగా ఎన్నడూ లేని విధంగా సుమారు 1000 మంది పోలీసులు ఈవెంట్ కు బలగంగా నిలవడం జరిగింది.
దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. పుష్ప 1 సమయంలో బన్నీతో నార్త్ ఇండియాని వదలకు. అక్కడ నీకోసం ఎంతోమంది అభిమానులు ఉన్నారు అని. ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్రమోషన్స్ అవసరం లేనంతగా క్రేజ్ ఉంది. సాధారణంగా ఏ సినిమా ఈవెంట్కైనా వెళ్ళినప్పుడు ఆ సినిమాకు ఉపయోగపడేలా ఏదైనా మాట్లాడుతాము, కానీ ఈ సినిమాకు అటువంటి అవసరం లేదు. కాబట్టి సరదాగా మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సుమారు రెండు మూడు నెలల క్రితం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప షూటింగ్ జరుగుతుండగా అక్కడికి వెళ్లాను. అక్కడ బన్నీ, సుకుమార్ గారితో మాట్లాడుతూ ఉండగా సుకుమార్ నాకు సినిమాలో ఒక సీన్ చూపించడం జరిగింది. ఆ సీన్ పుష్ప రాజ్ ఇంట్రడక్షన్ సీన్. అది చూస్తేనే నాకు అర్థం అయిపోయింది సినిమా ఎలా ఉండబోతుంది అనేది. వెంటనే దేవి శ్రీ ప్రసాద్ నుండి ఎంత మ్యూజిక్ చేయించుకోగలరు అంత చేయించుకోండి అని అన్నాను. ఇక డిసెంబర్ 4 సాయంత్రం నుండి ఈ సినిమా ఎలా ఉండిపోతుందనేది ప్రపంచం అందరికీ తెలిసిపోతుంది. మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వర్షం కూడా పడుతుంది, ఇది కచ్చితంగా ఒక శుభమే” అన్నారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.