iBOMMA: విచ్చలవిడిగా ఐబొమ్మలో సినిమాలు.. ఆ నొప్పి మీకు తెలియదంటూ మండిపడ్డ దర్శకుడు

థియేటర్స్ లో సినిమాను షూట్ చేసి దాన్ని సీడీలోకి ఎక్కించి అమ్మేవారు. దాంతో సినిమా థియేట్సర్ వెళ్లి సినిమా చూసేవారి సంఖ్య తగ్గేది. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద యుద్ధమే చేసింది. ఇక ఇప్పుడు టక్నాలజీతో పాటు ఇంటర్ నెట్ వాడకం కూడా పెరిగిపోయింది. దాంతో రకరకాల వెబ్ సైట్స్ లో కొత్త సినిమాలు పైరసీ అవుతున్నాయి.

iBOMMA: విచ్చలవిడిగా ఐబొమ్మలో సినిమాలు.. ఆ నొప్పి మీకు తెలియదంటూ మండిపడ్డ దర్శకుడు
Ibomma
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 16, 2023 | 1:26 PM

సినిమా పైరసీ అనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం. ఒకప్పుడు ఇంటర్ నెట్ అంతగా అందుబాటులోకి రాని సమయంలో సీడీల రూపంలో సినిమాలను పైరసీ చేసి అమ్మేవారు. థియేటర్స్ లో సినిమాను షూట్ చేసి దాన్ని సీడీలోకి ఎక్కించి అమ్మేవారు. దాంతో సినిమా థియేట్సర్ వెళ్లి సినిమా చూసేవారి సంఖ్య తగ్గేది. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద యుద్ధమే చేసింది. ఇక ఇప్పుడు టక్నాలజీతో పాటు ఇంటర్ నెట్ వాడకం కూడా పెరిగిపోయింది. దాంతో రకరకాల వెబ్ సైట్స్ లో కొత్త సినిమాలు పైరసీ అవుతున్నాయి. థియేటర్స్ లోకి వచ్చిన సాయంత్రానికే వెబ్ సైట్స్ లో సినిమాలు దర్శనమిస్తున్నాయి. ఇక ఐ బొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఐ బొమ్మ ఈ వెబ్ సైట్ ఓటీటీలో రిలీజ్ అయినా ప్రతి తెలుగు సినిమాను తన వెబ్ సైట్ లో కనిపిస్తుంది. కోట్లు పెట్టి ఓటీటీ సంస్థలు సినిమాలను కొంటుంటే ఆ సినిమాలను డౌన్ లోడ్ చేసి ఎలాంటి డబ్బులు కట్టే పనిలేకుండా ఈ వెబ్ సైట్ లో పెట్టేస్తున్నారు. ఓటీటీలో సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం ఐ బొమ్మ సినిమా ప్రత్యక్షం అవుతుంది. ఇప్పటికే జనాలు ఐ బొమ్మకు బాగా అలవాటు పడ్డారు. దాన్ని బ్యాన్ చేస్తే సోషల్ మీడియాలో పెద్దెత్తున ట్రోల్స్ చేస్తున్నారు.

ఇప్పటికే ఐ బొమ్మ పై చాల మంది సినీ ప్రముఖులు విమర్శలు గుప్పించారు. మొన్నామధ్య ఐ బొమ్మ టీమ్ ఛాలెంజ్ చేసి మరి థియేటర్స్ లో రిలీజ్ అయిన ఓ సినిమాను పైరసీ చేసి తమ సైట్ లో పెట్టేశారు. అలాగే పెద్ద వార్నింగ్ నోట్  కూడా ఇచ్చారు. ఇటీవల ఓ దర్శకుడు కూడా ఐ బొమ్మ పై మండిపడ్డారు. కృష్ణా రామా అనే సినిమా కు రాజ్ ముదిరాజు అనే దర్శకుడు డైరెక్ట్ చేశాడు. దాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే దాన్ని ఐ బొమ్మ సైట్ లో పెట్టేశారు. దాంతో దర్శకుడు స్పందిస్తూ.. అయ్యా ఐ బొమ్మా.. మా సినిమా లో పెద్ద హీరోలు లేరు.  రెమ్యునరేషన్ తీసుకునే ఇద్దరు నటులు మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. రోజుకూలీకి పని చేసేవాళ్లే నా సినిమాలో ఉన్నారు. మల్టీ నేషనల్ కంపెనీ ల ఎగ్జిక్యూటివ్స్ తో పోల్చి చూస్తే వాళ్ల సంపాదన చాలా తక్కువ . మా సినిమా థియేటర్స్ లో కూడా వదల్లేదు డైరెక్ట్ గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేశాం అన్నారు. మీ వెబ్ సైట్ లో కనిపిస్తున్న సినిమాలన్నీ చిన్న సినిమాలే.. నీతి కోసం, పేదవాళ్ల కోసం నిలబడుతున్నట్టు ఫోజులు కొట్టే మీకు ఎందుకింత హిపోక్రసీ అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఒక సినిమా తీస్తే మీకు ఆ బాధ తెలుస్తుంది అని అన్నారు రాజ్ ముదిరాజ్. ఆయన ఈ కామెంట్స్ చేసి చాలా రోజులే అవుతున్నా మారోసారి ఇది వైరల్ అవుతుంది. చాలా మంది రాజ్ ముదిరాజ్ మాటల్లో న్యాయం ఉందని అంటున్నారు. ఇలాంటి సైట్స్ వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయి అని కామెంట్ చేస్తున్నారు చాలా మంది.

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి