Puri Musings: ‘ప్రేమలో ఉన్నప్పుడు ప్రామిస్ చేయకండి.. ఇలాగే ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి’.. ప్రేమికుల కోసం పూరి జగన్నాథ్..

ప్రేమ అనేది కేవలం ఒక డ్రగ్ లాంటిదని.. శరీరంలో కెమికల్స్ విడుదలవడం వల్ల మాత్రమే భావోద్వేగాలు కలుగుతాయని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు.

Puri Musings: 'ప్రేమలో ఉన్నప్పుడు ప్రామిస్ చేయకండి.. ఇలాగే ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి'.. ప్రేమికుల కోసం పూరి జగన్నాథ్..
Puri Musings
Follow us

|

Updated on: Dec 22, 2022 | 6:29 AM

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటున్న సంగతి తెలిసిందే. తన యూట్యూబ్ ఛానల్ పూరి మ్యూజిక్స్ ద్వారా పలు విషయాలను ప్రస్తావిస్తూ.. ఫిలాసఫీకి సంబంధించిన అంశాలను చెప్పుకోస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో విషయాలను చెప్పిన పూరి..ఇప్పుడు ప్రేమికుల కోసం ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ప్రేమ అనేది కేవలం ఒక డ్రగ్ లాంటిదని.. శరీరంలో కెమికల్స్ విడుదలవడం వల్ల మాత్రమే భావోద్వేగాలు కలుగుతాయని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. లవ్ డ్రగ్ అంటూ పూరి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ప్రేమికుల కోసం మాస్ డైరెక్టర్ ఏం చెప్పారో తెలుసుకుందామా.

“ఇది ప్రేమలో మునిగితేలుతున్న ప్రేమికుల అందరి కోసం. రోజు మనలో కలిగే రకరకాల ఎమోషన్స్, భావోద్వేగాలకు కారణం మన శరీరంలో ఉన్న కెమికల్స్, డోపమైన, ఆక్సిటోసిన్, సెర్టోనియమ్, వీటివల్ల నవ్వు, ఆనందం, ప్రేమ, కన్నీళ్లు ఇలా ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి. కానీ వయసులో ఉన్న యూత్ కు మాత్రం వాడి ప్రేమ నిజం అనుకుంటాడు. అద్భుతం అనుకుంటాడు. ఆ అమ్మాయి దేవత అనుకుంటాడు. పవిత్రమైన వాళ్ల ప్రేమను పెద్దవాళ్లు అర్థం చేసుకోలేపోతున్నారని అనుకుంటాడు. డాక్టర్ హెలెన్ ఫిషన్ అనే యువత ప్రేమపై రీసెర్చ్ చేసింది. ఎందుకు ప్రేమిస్తున్నారు ?.. అతనే ఎందుకు ? ఆమె ఎందుకు ? ఇలా ఆరు పుస్తకాలు రాసింది. 2500 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసింది. వాళ్ల మెదళ్లను స్కాన్ చేసింది. ఎఫ్ఎంఆర్ఐ తీసింది. వాళ్ల పార్టనర్ ఫోటో చూపిస్తే వాళ్ల బ్రెయిన్ లో ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో రికార్డ్ చేసింది. కొంతమందికి వాళ్ల గర్ల్ ఫ్రెండ్ కంటే ఇంకా అందమైన అమ్మాయి ఫోటో చూపించింది. అప్పుడు ఇంకా బెటర్ రియాక్షన్ మెదడులో కనిపించాయి.

ఇంకొంతమందికి ఏ అమ్మాయిని చూపించినా ఒకేలా రియాక్ట్ అవుతున్నారని తెలిపింది. పరీక్షలు అన్ని అయ్యాక ప్రే, దోమా ఏమీ లేదు. ఇదంతా కెమికల్స్ మాయ. లవ్ ఒక డ్రగ్ అని తేలింది. ప్రేమించినప్పుడు హ్యాపీ కెమికల్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. ముద్దు పెట్టినప్పుడు, డోపమైన్ రిలీజ్ అయి.. ఆ ముద్దు చాలా బాగుంటుంది. అందుకే ఇంకో ముద్దు కావాలనిపిస్తుంది. మీరేమనుకుంటారంటే నా బంగారాన్ని ఎన్ని ముద్దులు పెట్టుకున్నా తనివి తీరదు ఏంటో అనుకుంటారు. లవ్ అనేది ఒక డ్రగ్. నువ్వు డ్రగ్ తీసుకున్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. ప్రేమ అనే డ్రగ్ లో ఉన్నప్పుడు నీ లవర్ కోసం అమ్మానాన్నలను.. ఆస్తులను వదిలేసి పారిపోవాలనిపిస్తుంది. అందుకే ప్రామిస్ చేసేముందు కనీసం రెండుసార్లు మాస్ట్రుబేట్ చేసుకోండి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

అప్పుడు కెమికల్స్ చల్లబడతాయి. అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి చేసుకో.. నింగి, నేలా తోడు ఉన్నాయని ఏవేవో అబద్ధాలు మీతో చెప్పి, తప్పు చేయిస్తారు. పాతికేళ్ల వయసు దాటితే కొంత బుద్ది , జ్ఞానం వస్తాయి. పాతికలోపు వాళ్లకు అస్సలు బుర్ర పనిచేయదు. ఒక పక్క కెమికల్స్ మనల్ని మోసం చేస్తుంటే.. ఏదో ఒక లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ అవుతుంది. దాన్ని నాలుగు సార్లు చూడడం.. అవే పాటలు పెట్టుకుని వింటూ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం.. ఇది జోక్ కాదు. ఇలాగే ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి. దయచేసి తప్పులు చేయకండి ” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.