Puri Jagannadh : పూరీ చెప్పిన మంచిమాట.. జంతువులు పుడతాయి, బతుకుతాయి, చనిపోతాయి…కానీ

|

May 15, 2021 | 8:51 PM

భవిష్యత్తులో వచ్చే దారుణ పరిస్థితుల నుంచి మన పిల్లల్ని రక్షించుకోవాలంటే... నాగరిక ప్రపంచానికి దూరంగా.. ప్రకృతితో మమేకమై.. జీవించాలని పూరీ జగన్నాథ్‌ అన్నారు

Puri Jagannadh : పూరీ చెప్పిన మంచిమాట.. జంతువులు పుడతాయి, బతుకుతాయి, చనిపోతాయి...కానీ
Follow us on

Puri Jagannadh : భవిష్యత్తులో వచ్చే దారుణ పరిస్థితుల నుంచి మన పిల్లల్ని రక్షించుకోవాలంటే… నాగరిక ప్రపంచానికి దూరంగా.. ప్రకృతితో మమేకమై.. జీవించాలని పూరీ జగన్నాథ్‌ అన్నారు. అందుకు ‘ఆఫ్‌ ది గ్రిడ్‌ పద్దతే’ సరైందని ఆయన సూచించారు. ప్రకృతి వినాశనానికి కాకుండా.. ప్రకృతిలో ఎలా మమేకమవ్వాలనే విషయాన్ని “పూరి మ్యూజింగ్స్‌”లో ఆయన వివరించి అందర్నీ ఆకట్టుకున్నారు.”‘ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్’‌.. నాగరిక ప్రపంచానికి దూరంగా ఎక్కడో ప్రకృతిలో ఎలాంటి ప్రజా వినియోగాలు లేకుండా బతకడం. ‘లివింగ్‌ ఆఫ్‌ ది గ్రిడ్‌’ అంటే మంచినీళ్లు‌, కరెంటు, గ్యాస్‌, ఇంటర్నెట్‌.. ఈ విధమైన రకాలైన మౌలిక వసతులు లేకుండా జీవించడం. స్వయం సమృద్ధ జీవనశైలి. గోయింగ్‌ ఆఫ్‌ ది గ్రిడ్‌ అనేది కొంతమంది మాత్రమే చేయగలరు. అలా చేయాలంటే సరైన ప్రదేశాన్ని చూసుకుని ముందు ఇల్లు నిర్మించుకోవాలి. సోలార్‌ లాంటి పవర్‌ సోర్సులు పెట్టుకోవాలి. కుదిరితే వర్షం నీటిని సైతం ఉపయోగించుకునేలా చూసుకోవాలి.” అని ఆయన చెప్పారు. ప్రపంచంలో 35మిలియన్ల మంది ఇలా ‘ఆఫ్‌ ది గ్రిడ్‌’ జీవనాన్ని కొనసాగిస్తున్నారని.. పర్యావరణం పట్ల వీళ్లు ఎంతో బాధ్యతగా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. మన పూర్వీకులు ఇలాగే ఎన్నో వేల సంవత్సరాలు బతికారని.. వీళ్లు సైతం ఆనాటి పూర్వీకుల జీవనశైలిని ఫాలో అవుతుంటారని పూరీ తెలిపారు.

అప్పట్లో అందరిదీ ‘ఆఫ్‌ గ్రిడ్‌ లివింగే’ కాబట్టే మన భూమి ఎంతో పచ్చగా ఉండేదని పూరీ అన్నారు. “జంతువులు పుడతాయి, బతుకుతాయి, చనిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 100 డైనోసార్లు అడవిలో పుట్టి అదే అడవిలో చనిపోతే ఈ ప్రకృతికి కూడా గుర్తు ఉండదు. కానీ నలుగురు మానవులు బతికి చనిపోయిన తర్వాత చూస్తే అడవి సగం నరికేసి ఉంటుంది. అందుకే ప్రకృతి మనల్ని గుర్తు పెట్టుకుంటుంది” అని పూరీ వివరించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Director S. Shankar: తిరిగి పట్టాలెక్కనున్న ఇండియన్ 2 మూవీ.. మరి రామ్ చరణ్ సినిమా పరిస్థితేంటి…

బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించాలంటే కొంచెం భయమేసింది.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..

Shilpa Shetty: మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమాలో సాగరకన్య.. కీలక పాత్రకోసం బాలీవుడ్ భామ..