Sobhan Babu: ఇదేందయ్యా ఇది..! ఈ లేడీ ప్రొడ్యూసర్ శోభన్ బాబు బంధువా..!
రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు మొదలయిన పౌరాణికి పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా నటించారు శోభన్ బాబు. అప్పటికే అగ్ర హీరోగా ఉన్నా, కాంబినేషన్ చిత్రాలలో ఎటువంటి భేషజాలు లేకుండా సాటి హీరోలతో నటించేవారు.
సినీ ఇండస్ట్రీలో సోగ్గాడిగా పేరు తెచ్చుకున్నారు లెజెండ్రీ యాక్టర్ శోభన్ బాబు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి స్టార్ గా రాణించారు శోభన్ బాబు. ఫ్యామిలి ఆడియన్స్ లో శోభన్ బాబుకు విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షలను మెప్పించారు శోభన్ బాబు. అభిమన్యుడిగా నర్తనశాలలో, అర్జునుడుగా భీష్మలో, లక్ష్మణుడుగా సీతారామకల్యాణంలో, కృష్ణునిగా బుద్ధిమంతుడులో ఇలా ఎన్నో పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు శోభన్ బాబు. మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబుకు మాస్ ఇమేజిని తెచ్చిపెట్టింది. దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం, రఘు రాముడు ఇలా కుటుంబ కథ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు శోభన్ బాబు.
ఇది కూడా చదవండి : Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్
అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబులా అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకొనేవారు. నటభూషణ, సోగ్గాడు, ఆంధ్రా అందగాడు అనే బిరుదులు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే శోభన్ బాబు వారసులు ఇండస్ట్రీలో ఎవరు లేరు. కానీ ఓ లేడీ ప్రొడ్యూసర్ శోభన్ బాబుకు బంధువు. ఓ లేడి డైరెక్టర్, నిర్మాత తాను శోభన్ బాబు బంధువు అని తెలిపారు.
ఇది కూడా చదవండి : Puri Jagannadh: అమ్మబాబోయ్..! పూరీజన్నాథ్ కూతురు ఎంతలా మారిపోయిందో.!
హరిత గోగినేని.. డైరెక్టర్, అలాగే నిర్మాతగా చేశారు ఆమె. గతంలో లక్కీ లక్ష్మణ్ అనే సినిమా చేసింది హరిత గోగినేని. ఫియర్ అనే సినిమాతో డైరెక్టర్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వేదిక ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరిత మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హరిత మాట్లాడుతూ.. శోభన్ బాబు గారు నాకు వరసకు పెదనాన్న అవుతారు అని చెప్పింది. శోభన్ బాబుగారు మా సొంత ఫ్యామిలీ కాదు కానీ రిలేటివ్స్ అవుతారు. నాకు, ఆయనకు మంచి మెమరీస్ ఉన్నాయి అని చెప్పారు హరిత గోగినేని. మా తాతయ్య ఊరు చిన నందిగామ. శోభన్ బాబు గారిది కూడా అదే ఊరు. మా తాతగారితో శోభన్ బాబు చాలా క్లోజ్.. నేను సెలవులకు అక్కడికి వెళ్లేదాన్ని.. ఆయనతో నాకు మంచి మెమొరీస్ ఉన్నాయి. కానీ నేను ఈ విషయాలను ఎక్కడా బయట పెట్టలేదు అని చెప్పారు.
ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.