Hanuman: ‘హనుమాన్’ సినిమా రిలీజ్ వాయిదా.. మేకర్స్ ఏం చెబుతున్నారంటే..

దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను మే 12న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉన్నట్లుండి హనుమాన్ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు మేకర్స్.

Hanuman: 'హనుమాన్' సినిమా రిలీజ్ వాయిదా.. మేకర్స్ ఏం చెబుతున్నారంటే..
Hanuman
Follow us

|

Updated on: May 06, 2023 | 6:56 AM

జాంబిరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం హనుమాన్. యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ మూవీ భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు కారణం గతంలో ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్. ఇందులో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్స్ పొగిడేశారు. అప్పుడే విడుదలైన ఆదిపురుష్ టీజర్ కంటే.. ఈ మూవీ టీజర్ సినీప్రియులను ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను మే 12న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉన్నట్లుండి హనుమాన్ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు మేకర్స్.

‘‘హనుమాన్’ టీజర్‌పై మీరు చూపించిన ప్రేమాభిమానాలతో మాపై బాధ్యత మరింత పెరిగింది. హనుమంతుడి స్ఫూర్తికి అద్ధం పట్టేలా, మనం కలిసి ఆనందంగా పండుగల సెలబ్రేట్ చేసుకునేలా ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తామ‌ని మీకు మాట ఇస్తున్నాం. త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తాం” అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో విజువల్ గా మెప్పించేలా రూపొందిస్తున్నారు. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, స్పానిష్, చైనీస్, జపనీస్, కొరియన్, ఇంగ్లీష్ ఇలా ఏకంగా 11 భాషలలో ఈ మూవీని రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పై కె నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో తేజా సజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను కీలకపాత్రలలో నటిస్తుండగా.. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!