Prasanth Varma: ‘సింబా’ వచ్చేస్తున్నాడు.. ప్రశాంత్ వర్మ కొత్త సినిమా పోస్టర్.. హీరోగా బాలయ్య తనయుడు ?
ఇందులో నటీంచే యాక్టర్స్ ఎవరెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేయనున్నాడని గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తుంది.
హనుమాన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఎలాంటి అంచనాలు లేకుండా రూపొందించిన ఓ చిన్న సినిమాను ఈ ఏడాది సంక్రాంతి కానుకగా స్టార్ హీరోలకు పోటీగా రిలీజ్ చేసి హిట్టు కొట్టాడు. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ప్రశాంత్ వర్మ మేకింగ్, విజువల్ ఎఫెక్ట్ చూసి ఫిదా అయ్యారు అడియన్స్. దీంతో హనుమాన్ సెకండ్ పార్ట్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇందులో నటీంచే యాక్టర్స్ ఎవరెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేయనున్నాడని గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తుంది.
ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ప్రశాంత్ వర్మ కూడా హింట్స్ ఇస్తూ వస్తున్నారు. తాజాగా బుధవారం ప్రశంత్ వర్మ తన సోషల్ మీడియా ఖాతాలలో సింబ్ వస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి సింబా రాబోతున్నాడంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా బాలయ్య తనయుడి సినిమానే అంటున్నారు నెటిజన్స్. తాజాగా ఈరోజు మరో పోస్టర్ రిలీజ్ చేశార. సింబా ఈజ్ కమింగ్ అంటూ ఉదయిస్తున్న సూర్యుడు కనపడేలా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే మోక్షజ్ఞ మొదటి సినిమా టైటిల్ సింబా కావచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లెగసీని ముందుకు తీసుకెళ్లే టైం వచ్చింది. రేపు ఉదయం 10 గంటల 36 నిమిషాలకు సింబా వస్తు్న్నాడు అంటూ రాసుకొచ్చారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. మోక్షజ్ఞ ఎంట్రీ ఉండనుందంటున్నారు ఫ్యాన్స్. దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
The moment has arrived to take the LEGACY forward!#SIMBAisComing 🦁#PVCU2 Announcement Tomorrow at 10:36 AM ❤️🔥@ThePVCU pic.twitter.com/NPGI9mLegF
— Prasanth Varma (@PrasanthVarma) September 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.