Manirathnam : 40 ఏళ్ల సినీ ప్రయాణంలో మణిరత్నం తొలిసారి ఆ నిర్ణయం.. కమల్ హాసన్ సినిమా కోసం..
ఇన్నేళ్ల తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'KH 234' వర్కింగ్ టైటిల్ కాగా.. నిన్న అసలు టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో పొడవాటి జుట్టు, శరీరానికి శాలువా చుట్టుకుని భీకర లుక్‌లో కనిపించాడు కమల్. వీడియోలో నాయకుడిగా గ్యాంగ్‌స్టర్ రంగరాయ శక్తివేల్ ఫైట్ సీన్‌లో సందడి చేశాడు. ఈ చిత్రానికి 'థగ్ లైఫ్' అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ విచిత్రమైన సినిమా టైటిల్ సోషల్ మీడియాలో ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత కమల్.. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమా చేయనున్నారు. నిన్న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా… వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ టైటిల్ తోపాటు.. గ్లంప్స్ రివీల్ చేశారు మేకర్స్. నాయకుడు సినిమా తర్వాత దాదాపు 35 ఏళ్లకు మళ్లీ ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతుంది. ఇన్నేళ్ల తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘KH 234’ వర్కింగ్ టైటిల్ కాగా.. నిన్న అసలు టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో పొడవాటి జుట్టు, శరీరానికి శాలువా చుట్టుకుని భీకర లుక్‌లో కనిపించాడు కమల్. వీడియోలో నాయకుడిగా గ్యాంగ్‌స్టర్ రంగరాయ శక్తివేల్ ఫైట్ సీన్‌లో సందడి చేశాడు. ఈ చిత్రానికి ‘థగ్ లైఫ్’ అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ విచిత్రమైన సినిమా టైటిల్ సోషల్ మీడియాలో ఆకర్షిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ టైటిల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. 1983లో పల్లవి అనుపల్లవి సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన మణిరత్నం 40 ఏళ్లుగా ఒక్క సినిమా పేరు కూడా ఇంగ్లీషులో పెట్టలేదు. ఈ మధ్య దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఒకే బంగారం’ సినిమాకు కూడా..’ఓ కాదల్ కన్మణి’ అంటే మనసైన బంగారం అని అర్థం. ఆ చిత్రాన్ని తెలుగులో ఒకే బంగారం పేరుతో దిల్ రాజు రిలీజ్ చేశారు.
View this post on Instagram
అయితే గత 40 ఏళ్లుగా తన సినిమాలకు ఇంగ్లీషు టైటిల్స్ పెట్టని మణిరత్నం తొలిసారిగా ‘కేహెచ్ 234’ చిత్రానికి ‘థగ్ లైఫ్’ అనే టైటిల్ పెట్టడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తుండడంతో ఈ చిత్రానికి థగ్ లైఫ్ అనే పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో త్రిష, జయం రవి, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.