స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కోవిడ్ భారిన పడిన.. అనారోగ్య సమస్యలతో చెన్నైలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని.. మరోసారి ఆయనకు కోవిడ్ పాజిటివ్ రావడంతోనే హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారని సన్నిహితులు అంటున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇటు కుటుంబసభ్యులు గానీ, ఆసుపత్రి వర్గాల నుంచి ఎలాంటి మెడికల్ బులెటిన్ విడుదల చేయలేదు. ప్రస్తుతం ఆయన తన కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ చిత్రీకరణలో పాల్గోంటున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, విక్రమ్, కార్తి, త్రిష ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. ఇటీవల నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్ మణిరత్నంతోపాటు.. చిత్రబృందం కూడా పాల్గొంది. ఆ సమయంలో కోవిడ్ నియమాలు పాటించలేదు. అయితే కొన్ని నెలల క్రితం పొన్నియన్ సెల్వన్ చిత్రంలో కీలకపాత్రలో నటించిన శరత్ కుమార్ కరోనాకు గురై వెంటనే కోలుకున్నారు. ఇక ఇటీవలే విక్రమ్ సైతం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు డైరెక్టర్ మణిరత్నం సైతం కోవిడ్ భారిన పడడంతో చిత్రయూనిట్ సభ్యులతోపాటు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. 1500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన చోళ సామ్రాజ్యం కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.