Director Jyothi Krishna: పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి మంచి సినిమా చేయడం గర్వంగా ఉంది.. డైరెక్టర్ జ్యోతికృష్ణ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రం ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి జూలై 24న అడుగుపెట్టింది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.

Director Jyothi Krishna: పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి మంచి సినిమా చేయడం గర్వంగా ఉంది.. డైరెక్టర్ జ్యోతికృష్ణ..
Jyothikrishna

Updated on: Jul 25, 2025 | 6:59 AM

పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హరి హర వీరమల్లు. భారీ అంచనాల మధ్య జూలై 24న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రాగా.. హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. సినిమా ముగింపు అద్భుతంగా ఉందని.. పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నామని చాలా మంది ఫోన్ చేసి ప్రశంసించారని డైరెక్టర్ జ్యోతికృష్ణ అన్నారు.

చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ, “థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకుల స్పందన చూసి చాలా సంతోషం కలిగింది. సినిమాని ముగించిన తీరు అద్భుతంగా ఉంది, రెండవ భాగం చూడాలనే ఆసక్తి కలుగుతోందని చాలామంది ఫోన్ చేసి ప్రశంసించారు. చిన్న చిన్న పిల్లలు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే అందరూ కలిసి చూస్తారు. పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి మంచి సినిమా చేయడం గర్వంగా ఉంది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు.. ఒకరు పవన్ గారు, ఇంకొకరు కీరవాణి గారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు 18 నిమిషాల ఫైట్ సీక్వెన్స్ ను కంపోజ్ చేశారు. పెద్దగా సంభాషణలు లేకుండా దాదాపు 30 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ ని కీరవాణి గారు తన సంగీతంతో మరోస్థాయికి తీసుకెళ్లారు. నిధి అగర్వాల్ గారు ఐదేళ్లుగా ఈ సినిమాను నమ్మి నిలబడ్డారు. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ సపోర్ట్ ను మరువలేను. మా నాన్న రత్నం గారు తన మొదటి సినిమా హిట్ అయినప్పుడు ఎంత ఆనందపడ్డారో.. మళ్ళీ అంతటి ఆనందాన్ని ఇన్నాళ్లకు ఆయన ముఖంలో చూశాను. ఈ సినిమా ఆయనకు ఎంతటి డ్రీం ప్రాజెక్టో ఆ సంతోషంలోనే తెలుస్తోంది. ఈ సినీ ప్రయాణంలో నా భార్య, మా అమ్మ ఇచ్చిన సపోర్ట్ ని ఎప్పటికీ మరచిపోలేము. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పవన్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.” అన్నారు.

ప్రముఖ నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ, “పవర్ స్టార్ గారి పవర్ ఏంటో మేము నిన్న విమల్ థియేటర్ సాక్షిగా చూశాను. ఒక్క షో ప్రీమియర్ కే రూ.3.36 కోట్ల షేర్ చేసింది. ఆ నెంబర్ చూసి మేము షాక్ అయ్యాము. మొదటి రోజు వసూళ్ల పరంగా రికార్డు నెంబర్లు చూడబోతున్నాం. అన్ని చోట్లా అద్భుతమైన స్పందన లభిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు తెర మీద కనిపిస్తే ఆ ఆనందమే వీరు.” అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి:

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!

Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..