Ravi Teja: మాస్ రాజా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన గోపిచంద్ మలినేని.. అదేంటంటే

ఇక చాలా కాలం తర్వాత రవితేజకు హిట్ ఇచ్చిన సినిమా క్రాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Ravi Teja: మాస్ రాజా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన గోపిచంద్ మలినేని.. అదేంటంటే
Raviteja

Updated on: Dec 22, 2022 | 8:58 PM

మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమాలు ఈ మధ్య ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. అప్పుడెప్పుడో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్లీ వరుస ఫ్లాప్ లు అందుకున్నాడు రవితేజ. ఇక చాలా కాలం తర్వాత రవితేజకు హిట్ ఇచ్చిన సినిమా క్రాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మాస్ మహారాజాకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్రలో నటించాడు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. యదార్ధ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ సినిమా తర్వాత మళ్లీ మాములే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు అందుకుంటున్నాడు రవితేజ. ఈ క్రమంలోనే ఇప్పుడు క్రాక్ సినిమా సీక్వెల్ గురించి ఆసక్తికర వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

రవితేజతో మూడు సినిమాలు చేశాడు గోపీచంద్ మలినేని. డాన్ శీను , బలుపు, క్రాక్.. ఇక ఇప్పుడు క్రాక్ 2 చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా గోపీచంద్ మలినేని మాట్లాడుతూ క్రాక్ 2 పై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రవితేజ ధమాకా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ, గోపీచంద్ మలినేనితో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. త్వరలోనే క్రాక్ 2 వస్తుందని అన్నారు.

గోపీచంద్ ప్రస్తుతం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అటు రవితేజ కూడా ధమాకా తర్వాత వరుస సినిమాలను కమిట్ అయ్యారు.ఈ సినిమా లు పూర్తయిన తర్వాత క్రాక్2 సినిమా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ 2 కూడా ఉండే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇవి కూడా చదవండి