Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thandel Movie: ఒక్క ఎపిసోడ్ కోసమే రూ.18 కోట్లు.. తండేల్ పై అంచనాలు పెంచిన డైరెక్టర్..

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. వచ్చే నెలలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

Thandel Movie: ఒక్క ఎపిసోడ్ కోసమే రూ.18 కోట్లు.. తండేల్ పై అంచనాలు పెంచిన డైరెక్టర్..
Chandoo Mondeti
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 30, 2025 | 8:34 PM

డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ మూవీ తండేల్. ఇందులో యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ మరింత హైప్ పెంచాయి. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పుడు యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నారు.

ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ తండేల్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘నా గత చిత్రం కార్తికేయ 2 అనుభవం తండేల్ సినిమాకు ఎక్కువగా ఉపయోగపడింది. నేనెప్పుడూ అనుకున్న బడ్జెట్ ను దాటి సినిమా చేయను.. తండేల్ సినిమా రీసెర్చ్ అనంతరం కథ రాయడం పూరయ్యింది. హీరో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే బాగుంటుందో టెస్ట్ చేసేందుకు మళ్లీ డి. మత్య్సలేశం వెళ్లి ఇంకా ఏం జరిగింది ? అనే వివరాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నాం. సముద్రంలో చోటు చేసుకున్న తుఫాను .. ఆసమయంలో మత్య్సకారుల సమయస్పూర్తి గురించి వివరించారు. అప్పటికే పూర్తైన కథకు తగ్గట్టు బడ్జెట్ ఫిక్స్ అయిపోయినా ఇలాంటి విజువల్స్ ఉంటే బాగుందని అనుకున్నాను. వెంటనే నిర్మాతలు సైతం సరే అన్నారు. ఒక్క ఎపిసోడ్ కోసమే రూ.18 కోట్ల బడ్జెట్ అయ్యింది. లైవ్ లొకేషన్ సముద్రంలో, స్టూడియోలో మినియేచర్, వర్చువల్ గా సన్నివేశాలను చిత్రీకరించాం’ అంటూ చెప్పుకొచ్చారు.

తండేల్ చిత్రాన్ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత హీరో సూర్యతో కలిసి చందూ మొండేటి ఓ ప్రాజెక్ట్ చేయనున్నారట.ఆ ఆ తర్వాత కార్తికేయ 3 సినిమాను తెరకెక్కిస్తానని అన్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..