AR Murugadoss: రాత్రి 8 గంటలకు సెట్‏కు వస్తారు.. ఆ హీరోతో షూటింగ్ అంత ఈజీ కాదు.. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్..

దక్షిణాదిలోని టాప్ దర్శకులలో ఏఆర్ మురుగదాస్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేశారు. ఇటీవలే సికందర్ సినిమాతో అడియన్స్ వచ్చారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా.. రష్మిక మందన్న కథానాయికగా నటించింది.

AR Murugadoss: రాత్రి 8 గంటలకు సెట్‏కు వస్తారు.. ఆ హీరోతో షూటింగ్ అంత ఈజీ కాదు.. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్..
Ar Murugadoss

Updated on: Aug 19, 2025 | 2:35 PM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన లేటేస్ట్ మూవీ సికందర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూసింది. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అటు సల్మాన్, ఇటు డైరెక్టర్ మురగదాస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ సినిమా మొత్తం రూ.105.18 కోట్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా రిజల్ట్ పై డైరెక్టర్ మురుగదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురుగదాస్ మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరోతో సినిమా చేయడం అంత సులభం కాదని అన్నారు. సూపర్ స్టార్ హీరోలతో పనిచేసినప్పుడు తాను ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు.

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ.. “ఒక స్టార్ హీరోతో సినిమా చేయడం అంత సులభం కాదు. పగటిపూట సన్నివేశాలు తీయాల్సి ఉంటుంది. కానీ అతడు మాత్రం రాత్రి 8 గంటలకే సెట్స్ కు వస్తాడు. కాబట్టి మేము రాత్రిపూట మాత్రమే షూట్ చేయాల్సి వస్తుంది. కానీ మేము తెల్లవారుజామునే షూట్ చేయడానికి అలవాటు పడ్డాం. కానీ అక్కడ పరిస్థితులు అలా ఉండవు. ఒక సన్నివేశంలో నలుగురు పిల్లలు ఉంటే.. మేము వారితో తెల్లవారుజామున 2 గంటలకు షూట్ చేయాల్సి ఉంటుంది. అది వారు పాఠశాల నుంచి తిరిగి వస్తున్న షాట్ అయినా సరే.. ఆ సమయానికి వారు అలసిపోయి నిద్రపోతారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

ఇక సినిమాలో రాజు తన భార్యను కోల్పోయినప్పుడు .. ఆమె అవయవాలను ముగ్గురు వేర్వేరు వ్యక్తులకు దానం చేస్తారు. తర్వాత వారిని వెతుకుతాడు. ఆమె కోసం తాను చేయలేని పనులను నేరవేర్చడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో అతడు మొత్తం గ్రామంలోని అందరితో స్నేహం చేస్తాడు. కథ భావోద్వేగంగా ఉంటుంది. కానీ నేను ఆ ఎమోషన్ సరిగ్గా చూపించలేకపోయాను ” అని అన్నారు.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?