Anil Ravipudi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లపై దుష్ప్రచారం.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏమన్నారంటే?

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు మూవీ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు నిర్మాతలు. అయితే కొందరు అదంతా ఫేక్‌ కలెక్షన్స్‌ అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. తాజాగా దీనిపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు.

Anil Ravipudi: మన శంకరవరప్రసాద్ గారు కలెక్షన్లపై దుష్ప్రచారం.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
Mana Shankaravaraprasad Garu Movie

Updated on: Jan 25, 2026 | 7:45 AM

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ మెగా మూవీకి రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే బుక్ మై షోలనూ 25 మిలియన్‌ టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే కొందరు మాత్రం మన శంకరవరప్రసాద్ గారు మూవీకి ఫేక్‌ కలెక్షన్స్‌ అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో పాటు చాలా సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చాయి. అయితే, తాము చాలా ఓపెన్‌గానే కలెక్షన్స్‌ వివరాలు ఎప్పటికప్పడు ప్రకటిస్తూనే ఉన్నాం. వాటిని కొందరు మీడియా మిత్రులు కూడా షేర్‌ చేస్తూనే ఉన్నారు. అందులో ఎలాంటి దాపరికం లేదు. ఫేక్‌ కలెక్షన్స్‌ వివరాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు’

‘ప్రేక్షకులు మెగాస్టార్ ను ఎలా చూడాలని అనుకున్నారో అంతే రేంజ్‌లో మేము తెరపై ఆయన కనిపించేలా జాగ్రత్త పడ్డాం. ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్‌ ఎక్కడెక్కడో ఉన్నవారంతా థియేటర్‌కు వచ్చేశారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేశారు. అందుకే బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ పెరిగాయి. కేవలం వారంలోనే ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయిపోయింది. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్స్‌ యజమానులకు కూడా భారీ లాభాలు వచ్చేశాయి’ అని అనిల్‌ రావిపూడి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

నేడు సక్సెస్ మీట్.

కాగా ఆదివారం (జనవరి 24) మన శంకరవరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు చిత్ర బృందమంతా పాల్గొంటుంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.