Tollywood: ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే: అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి ఆగడు సినిమా సెకండ్ హాఫ్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. తాను పటాస్ తరహాలో సెకండ్ హాఫ్‌ను సూచించినా, శ్రీను వైట్ల ఎంటర్టైన్మెంట్ వైపే మొగ్గు చూపారని తెలిపారు. తాను అప్పుడు పటాస్ పనులతో బిజీగా ఉండటం వల్ల ఆగడు సెకండ్ హాఫ్‌కు ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని అన్నారు.

Tollywood: ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే: అనిల్ రావిపూడి
Anil Ravipudi

Updated on: Jan 20, 2026 | 1:51 PM

దర్శకుడు అనిల్ రావిపూడి ఆగడు సినిమా సెకండ్ హాఫ్ గురించి, రచయితగా, దర్శకుడిగా తన ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను అప్పటివరకు వేర్వేరు జానర్ల సినిమాలు చేయలేదని, ఒకే జానర్లో రెండు సినిమాలు చేసి ఉంటే కొన్ని అంశాలు రిపీట్ అయ్యే అవకాశం ఉండేదని తెలిపారు. ఆగడు సినిమా సెకండ్ హాఫ్ విషయంలో దర్శకుడు శ్రీను వైట్లతో ఒక చిన్న చర్చ జరిగిందని అనిల్ రావిపూడి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను పటాస్ సినిమా పనుల్లో ఉన్నానని, పటాస్ తరహాలో ఎమోషనల్ అండ్ హీరోయిజం నిండిన సెకండ్ హాఫ్‌ను ఆగడుకి సూచించాలనుకున్నా. అయితే, ఆగడు సెకండ్ హాఫ్ పూర్తి ఎంటర్టైన్మెంట్‌తో సాగాలని.. శ్రీను వైట్ల ఆ ఫార్మాట్‌ను నమ్మి పనిచేశారని తెలిపారు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

తాను పటాస్ పనులతో సమాంతరంగా బిజీగా ఉండటం వల్ల, ఆగడు సెకండ్ హాఫ్‌కు పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోయినట్లు వెల్లడించారు. “నేను నిజంగా ఓపెన్‌గా డిస్కస్ చేసి ఉంటే, బహుశా పటాస్ సెకండ్ హాఫ్ ఆగడు అయ్యేదేమో” అని ఆయన నవ్వుతూ అన్నారు. ఈ విషయంలో తనకు చిన్న అసంతృప్తి మిగిలిందని పేర్కొన్నారు. అయితే, మసాలా సినిమాకు మాటలు రాసినప్పుడు ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదని అనిల్ రావిపూడి చెప్పారు. అది బోల్ బచ్చన్‌కు రీమేక్ కావడంతో, తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయకుండా యథాతథంగా వెళ్ళామని, కేవలం వెంకటేష్ ఇంగ్లీష్ డైలాగులు మాత్రమే మార్చగలిగామని తెలిపారు. మసాలా సినిమాను మొదట తనకు డైరెక్ట్ చేయమని సురేష్ బాబు అడిగారని, అయితే తన మొదటి సినిమా ఒక యాక్షన్ టింజ్‌తో ఉండాలని కోరుకున్నందున ఆ అవకాశాన్ని తిరస్కరించానని వివరించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..