Dimple Hayathi: ‘నాపై తప్పుడు కేసు పెట్టారు..’ హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ డింపుల్ హయాతి..

|

Jun 08, 2023 | 6:54 AM

డీసీపీ కారును కాలితో తన్నడమే కాకుండా తన బెంజికారుతో రివర్స్ లో వచ్చి ఢీకొట్టి దుర్భాషలాడిందంటూ నటిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఈ వివాదంపై తాజాగా హైకోర్టును ఆశ్రయించింది డింపుల్. ట్రాఫిక్ డీసీపీ ఒత్తిడితో తనపై తప్పుడు కేసు పెట్టారని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆమెకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు.

Dimple Hayathi: నాపై తప్పుడు కేసు పెట్టారు.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ డింపుల్ హయాతి..
Dimple Hayathi
Follow us on

అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో డింపుల్ హయాతి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే రామబాణం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. కొద్ది రోజుల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎస్ అధికారి, డీసీపీ రాహుల్ హెగ్డేకు.. హీరోయిన్ డింపుల్ హయాతి మద్య వివాదం తలెత్తింది. డీసీపీ కారును కాలితో తన్నడమే కాకుండా తన బెంజికారుతో రివర్స్ లో వచ్చి ఢీకొట్టి దుర్భాషలాడిందంటూ నటిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఈ వివాదంపై తాజాగా హైకోర్టును ఆశ్రయించింది డింపుల్. ట్రాఫిక్ డీసీపీ ఒత్తిడితో తనపై తప్పుడు కేసు పెట్టారని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆమెకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు.

వాదనలు విన్న న్యాయస్థానం.. సీఆర్పీసీ 41ఏ నిబంధనల మేరకే వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. కాగా.. ఐపీఎస్ అధికారి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి చేశారన్న కారణంతో ఆయన డ్రైవర్ చేతన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హాయతి, డేవిడ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.