AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది.. ఆమె ఎవరంటే

సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేం. కొంతమంది ఒక్క సినిమాతో కనిపించకుండా పోతున్నారు. అలాగే మరికొంతమంది వరుస సినిమాలు చేస్తున్నారు. ఇంకొంతమంది నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతలు. దర్శకులుగా మారిపోతున్నారు. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది.. ఆమె ఎవరంటే
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 15, 2026 | 4:51 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి నటీనటులుగా, దర్శకులుగా రాణిస్తున్నారు. ఒకప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అలాగే హీరోలు విలన్స్ గా అవతారమెత్తుతున్నారు. కాగా కొంతమంది హీరోయిన్స్ మాత్రం నిర్మాతలు, దర్శకులుగా కూడా మారుతున్నారు. ఇక ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అలాగే ఒకప్పుడు హీరోయిన్ గా తన అందం, అభినయంతో మెప్పించిన ఓ ముద్దుగుమ్మ ఇప్పుడు దర్శకురాలిగా మారింది. పై ఫొటోలో కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా.? ఒకప్పుడు ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండేది. ఆమె మరెవరో కాదు గీతూ మోహన్‌దాస్.

ఇది కూడా చదవండి : ఏంటీ.. ఈవిడా ఆమె ఒక్కరేనా..!! ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ బ్యూటీ ఈ అమ్మడు

ఈ క్రేజీ దర్శకురాలు తన ఐదేళ్ల వయసులోనే మలయాళ చిత్రం ఒన్ను ముతల్ పూజ్యం వరేలో బాలనటిగా చలనచిత్ర రంగానికి పరిచయమైంది. ఆతర్వాత హీరోయిన్ గా మారి మలయాళం, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 2004లో అకలే చిత్రంలో నటనకు గాను ఆమె “ఉత్తమ నటి”గా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. దర్శకురాలిగా గుర్తింపుకెమెరా వెనుక ప్రతిభ చూపించాలనే లక్ష్యంతో 2009లో ‘అన్‍ప్లగ్డ్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, కెల్కున్నుందో అనే షార్ట్ ఫిలింతో మొదటిసారి దర్శకత్వం వహించింది.

ఇది కూడా చదవండి : దొరికేసింది మావ..! అగ్నిపరీక్ష ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి బయట ఎలా ఉందో చూశారా..

ఈ లఘుచిత్రం జాతీయ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవడమే కాకుండా కేరళ రాష్ట్ర 12వ తరగతి సిలబస్‌లోనూ చోటు దక్కించుకుంది. సామాజిక అంశాలు, మానవ సంబంధాలలోని సంక్లిష్టతను వాస్తవిక దృక్పథంతో తెరకెక్కించే దర్శకురాలిగా గీతూ మోహన్‌దాస్ ప్రత్యేక ముద్ర వేశారు. కెమెరామెన్ రాజీవ్ రవిని వివాహం చేసుకున్న ఆమె ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో యష్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులో ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, ట్రైలర్స్ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టాక్సిక్ సినిమా గ్యాంగ్‌స్టర్  నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాతో గీతూ మోహన్‌దాస్ పేరు మరోసారి మారుమ్రోగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నాడా.? ఆయన కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుడ్‌న్యూస్.. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సేఫ్టీ ఫీచర్ వచ్చింది
గుడ్‌న్యూస్.. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సేఫ్టీ ఫీచర్ వచ్చింది
ఇదెక్కడి దరిద్రంరా..! కండోమ్‌ను కడిగి మళ్లీ వాడుతున్న వ్యక్తి!
ఇదెక్కడి దరిద్రంరా..! కండోమ్‌ను కడిగి మళ్లీ వాడుతున్న వ్యక్తి!
ప్రేమలో నిజాయితీగా, నమ్మకంగా ఉండే వ్యక్తులు.. ఈ తేదీల్లో..
ప్రేమలో నిజాయితీగా, నమ్మకంగా ఉండే వ్యక్తులు.. ఈ తేదీల్లో..
ఎప్పుడైనా ఆలోచించారా.. నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..?
ఎప్పుడైనా ఆలోచించారా.. నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..?
మతం మారితే రిజర్వేషన్లు రద్దవుతాయా?
మతం మారితే రిజర్వేషన్లు రద్దవుతాయా?
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..!
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..!
చికెన్ లవర్స్ జాగ్రత్త.. రోజూ తింటే ఈ రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే
చికెన్ లవర్స్ జాగ్రత్త.. రోజూ తింటే ఈ రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..