Tollywood: చైల్డ్ ఆర్టిస్ట్‌గా రూ.900.. ఇప్పుడు కోట్లు తీసుకుంటోన్న టాలీవుడ్ మాస్ హీరో.. గుర్తు పట్టారా?

గతంలో పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టులుగా నటించి మెప్పించిన చాలా మంది ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. పై ఫొటోలో ఉన్న నటుడు కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతాడు. గతంలో ఒకే ఒక సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ లో మాస్ హీరోగా మన్ననలు అందుకుంటున్నాడు.

Tollywood: చైల్డ్ ఆర్టిస్ట్‌గా  రూ.900.. ఇప్పుడు కోట్లు తీసుకుంటోన్న టాలీవుడ్ మాస్ హీరో.. గుర్తు పట్టారా?
Tollywood Actor

Updated on: Feb 09, 2025 | 7:01 PM

 

పై ఫొటోలో సిగరెట్ పట్టుకుని స్టైల్ గా పోజులిస్తోన్న పోరగాడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ లో తిరుగులేని అభిమానం సంపాదించుకున్నాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు ఎక్కువగా మాస్ సినిమాలే చేసినప్పటికీ ప్రేమ కథలు, ఫ్యామిలీ స్టోరీస్ తోనూ మెప్పించాడు. అలాగే ప్రయోగాత్మక సినిమాల్లోనూ నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నాడు. గతంలో చాలా కొద్ది మంది హీరోలు మాత్రమే పోషించిన లేడీ గెటప్పుతో మనల్ని అలరించేందుకు వస్తున్నాడు. యస్. అతను మరెవరో కాదు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. సాధారణంగా చాలా మంది విశ్వక్ సేన్ మొదటి సినిమా ‘వెళ్ళిపోమాకే’ అని అనుకుంటారు. కానీ అతను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అయితే అది కేవలం ఒక్క సినిమాలో మాత్రమే.

ఇవి కూడా చదవండి

దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు నటించిన బంగారు బాబు సినిమాలో విశ్వక్ సేన్ ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. అప్పుడు అతను 9వ తరగతి చదువుతుండే వాడట. అదే సమయంలో దాసరి సినిమా కోసం ఛైల్డ్ ఆర్టిస్టులు కావాలన్న ప్రకటనను చూసి తన ఫొటోలు పంపించాడట. దర్శక నిర్మాతలు కూడా ఒకే చెప్పడంతో బంగారు బాబు సినిమాకి సెలెక్ట్ అయ్యాడట.
‘మేం అప్పుడు దిల్‌షుఖ్ నగర్ లో ఉండేవాళ్ళం. ఫస్ట్ టైం ఇంటికి వ్యాన్ వచ్చి ఎక్కించుకొని రామోజీ ఫిలింసిటీకి తీసుకెళ్లింది. అదే అప్పుడే నేను మొదటిసారి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లాను. నా పాత్ర కు సంబంధించి షూటింగ్ ఒక్కరోజులోనే అయిపొయింది. హీరో చిన్నప్పుడు అతన్ని చెడగొట్టే బ్యాచ్ లో నేనొకడ్ని. ఒక రెండు షాట్స్ లో మాత్రమే కనిపిస్తాను సినిమాలో. ఇందుకు నాకు 900 రెమ్యునరేషన్ ఇచ్చారు’ అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు విశ్వక్.

లైలా సినిమాలో విశ్వక్ సేన్..

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సినిమాకు దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి