Tollywood: అప్పుడు హోటల్‌లో ఉద్యోగం.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా కోట్లాది ఆస్తులు.. ఎవరో గుర్తు పట్టారా?

సంప్రదాయ పంజాబీ- హిందూ ఫ్యామిలీలో పుట్టిన ఈ అమ్మాయిని సినిమాల్లోకి పంపించేందుకు తండ్రి ఏ మాత్రం ఇష్టపడలేదు. అయితేనేం తండ్రి మాటను కాదని సినిమాల్లోకి అడుగు పెట్టింది. క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కోట్లాది ఆస్తులు కూడ బెట్టింది.

Tollywood: అప్పుడు హోటల్‌లో ఉద్యోగం.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా కోట్లాది ఆస్తులు.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: Feb 22, 2025 | 4:06 PM

సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేని హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. ఆమె స్వయం కృషితో ఇండస్ట్రీలో తమ కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కనీసం తమ సొంత కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించకపోయినా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నటిగా ఫేమస్ అయ్యింది. అయితే సినిమాల్లోకి రాక ముందు ఈ హీరోయిన్ ఒక ఫేమస్ హోటల్ లో ఇంటర్న్‌గా పనిచేసింది. అదే సమయంలో మోడలింగ్ రంగంలో అదృష్టం పరీక్షించుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. అనతి కాలంలోనే తన అందం, అభినంయతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు నాని ఆహా కల్యాణం సినిమాలో నటించిన వాణీ కపూర్.

‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వాణీ కపూర్. ఆ తర్వాత తెలుగులో న్యాచురల్ స్టార్ నానితో కలిసి ఆహా కల్యాణం సినిమాలో యాక్ట్ చేసింది. ఇందులో ఆమె అందం, అభినయం అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ కే వెళ్లిపోయింది. అక్కడ వరుసగా సూపర్ హిట్ సినిమాలు అందుకుంది. బేఫికర్, వార్, బెల్ బాటమ్, ఛండీఘర్ కరే ఆషికీ, షంషేరా, ఖేల్ ఖేల్ మే తదితర సూపర్ హిట్ సినిమాల్లో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో బత్త్ మీజ్ దిల్, రైడ్ 2, అబిర్ గులాల్ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.\

ఇవి కూడా చదవండి

వాణీ కపూర్ లేటెస్ట్ ఫొటోస్..

మీడియా నివేదికల ప్రకారం, 2022లో వాణి కపూర్ సంపద దాదాపు రూ. 10 కోట్లు. అలాగే వాణికి పెద్ద ఎత్తున విలువైన ఆస్తులు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో లగ్జరీ విల్లాలున్నాయి. ఇది కాకుండా, చాలా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. వాణి సినిమాలు, ప్రకటనల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఇది కాకుండా, నటి సోషల్ మీడియా ద్వారా కూడా ఆదాయం ఆర్జిస్తోంది. ఈ నటి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభిమానుల కోసం తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..