
ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఓ బ్యూటీ.. మరో సినిమాలో అదే హీరోకు చెల్లెలిగా నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఒక హీరోతో రొమాన్స్ చేసిన హీరోయిన్.. మరో హీరోకు చెల్లిగానో, అక్కగానో నటించి మెప్పించారు కూడా. ఇప్పుడు అలాంటి ఓ రేర్ కాం బినేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్, ప్రభాస్. బాహుబలి, సలార్, కల్కి సినిమాలతో డార్లింగ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోతే, పుష్ప, పుష్ప2 చిత్రాలతో బన్నీ కూడా అదే దారిలో నడిచాడు. ఈ స్టార్ హీరోల పక్కన ఎంతో మంది హీరోయిన్లు నటించారు. బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఈ స్టార్ హీరోలతో రొమాన్స్ చేశారు. అయితే ఒక సినిమాలో ప్రభాస్ మరదలిగా నటించిన ఓ హీరోయిన్.. మరో సినిమాలో అల్లు అర్జున్‌కు నటించింది.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా? ఆమె మరోవరో కాదు.. సింధు తులాని.
చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఐతే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సింధు తులాని. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సింధు అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత కల్యాణ్ రామ్ అతనొక్కడే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకుందీ అందాల తార. అలాగే నవదీప్ తో చేసిన గౌతమ్ ఎస్ఎస్‌సీ సినిమా కూడా సింధుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇదే క్రమంలో ప్రభాస్ నటించిన పౌర్ణమి సినిమాలో డార్లింగ్ కు మరదలిగా నటించిందీ అందాల తార. ఈ మూవీలో ఆమె కనిపించేది ఒకటి, రెండు సీన్లలోనే అయినా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత సహాయక నటిగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించింది సింధు తులాని. అలా అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఆమె వెన్నెల కిషోర్ భార్యగా, అల్లు అర్జున్‌కు వదినగా నటించింది. అలాగే ఇష్క్ సినిమాలో హీరో నితిన్ కు అక్కగానూ యాక్ట్ చేసింది. కాగా చివరిగా సింధు తులాని.. అంజలి హీరోయిన్‌గా నటించిన హార్రర్ సినిమా చిత్రాంగధలో నటించింది. ఆ తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. సింధు.. చేతన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకుంది. వీళ్లకు శ్వేత అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం సింధు సినిమాలకు దూరంగా ముంబైలో ఉంటోందని తెలుస్తోంది.
Sindhu Tolani
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.