Tollywood: ఒకప్పుడు ఆఫీస్ బాయ్‌గా టీ, సమోసాలు ఇచ్చాడు.. ఇప్పుడు స్టార్ హీరోగా కోట్లాది ఆస్తులు.. ఎవరంటే?

చదువుకునే రోజుల్లో నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. నాటకాలు, స్టేజ్ షోల్లో సత్తా చాటాడు. ఎన్నో అవమానాలు, వైఫల్యాలను అధిగమించి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ తర్వాత హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. తన నటనా ప్రతిభతో దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Tollywood: ఒకప్పుడు ఆఫీస్ బాయ్‌గా టీ, సమోసాలు ఇచ్చాడు.. ఇప్పుడు స్టార్ హీరోగా కోట్లాది ఆస్తులు.. ఎవరంటే?
Kantara Actor Rishab Shetty

Updated on: Oct 01, 2025 | 12:30 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఠక్కున చూసి అమ్మాయి అనుకునేరు.. అందులో ఉన్నది ఒక పాన్ ఇండియా హీరో. చిన్నప్పటి నుంచే ఈ హీరోకు నటనపై ఆసక్తి ఎక్కువ. అందుకే చదువుకునేటప్పుడే నాటకాలు, స్టేజ్ షోల్లో పార్టిసిపేట్ చేశాడు. ఎన్నో బహమతులు కూడా గెల్చుకున్నాడు. యాక్టింగ్ పై మక్కువతోనే డిగ్రీ పూర్తి చేయమని తండ్రి బెంగళూరు పంపిస్తే ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పాకెట్ మనీ కోసం రకరకాల పనులు చేశారు. వాటర్ బాయ్ గా మారి వీధుల్లో వాటర్ క్యాన్లు అమ్మాడు. హోటల్స్ లో కూడా పని చేశాడు. ఇక ముంబయిలో ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా కూడా వర్క్ చేశాడు. అక్కడకు వచ్చే అతిథులకు టీ, సమోసా అందించాడు. ఇదే క్రమంలో తనకున్న పరిచయాలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్ గా సత్తా చాటాడు. ఆ తర్వాత నటుడిగానూ ప్రూవ్ చేసుకున్నాడు. అయితే మూడేళ్ల క్రితం వరకు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కమ్ హీరో గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. 2022లో రిలీజైన ఒక సినిమా ఈ నటుడికి పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాదు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని కూడా అందించింది.

ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. అతను మరెవరో కాదు కాంతారా హీరో రిషబ్ శెట్టి. కాంతార ఛాప్టర్ 1 సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు, ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించింది. జయరాం, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమ్మినాడ్‌, దీపక్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరికొన్ని గంటల్లో  కాంతార 2 ప్రీమియర్స్..

 

హోంబలే సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో కాంతార ఛాప్టర్ 1 సినిమాను నిర్మించింది. అజనీష్ లోక్ నాథ్ స్వరాలు సమకూర్చారు. దసరా కానుకగా గురువారం(అక్టోబర్ 02) ఈ సినిమా విడుదల కానుండగా ఇవాళ్ట అర్ధరాత్రి నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి.

సినిమా ప్రమోషన్లలో రిషబ్ శెట్టి..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..