మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్.. అమెరికాలో జాబ్ మానేసి సినిమాల్లోకి.. ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?

కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. ఆ తర్వాత సోలో హీరోగా సినిమాలు చేసి మెప్పించాడు. ఓ వైపు నటుడిగా రాణిస్తూనే మంచి ఫీల్ గుడ్ గుడ్ సినిమాలను తెరకెక్కించి ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్.. అమెరికాలో జాబ్ మానేసి సినిమాల్లోకి.. ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?
Tollywood Actor

Updated on: Oct 08, 2025 | 8:29 PM

పై ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి టాలీవుడ్ లో బాగా ఫేమస్. పైగా మన తెలుగు ప్రాంతానికి చెందిన వాడే. కాకినాడలో పుట్టి పెరిగాడు. విజయవాడలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లి మాస్టర్స్ కూడా పూర్తి చేశాడు. అక్కడే మంచి హార్డ్ వేర్ జాబ్ కూడా సాధించుకున్నాడు. లక్షల్లో జీతం.. కానీ సినిమాలపై మక్కువతో మళ్లీ ఇండియాకు వచ్చేశాడు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. కమెడియన్ గ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత సోలో హీరోగానూ మెప్పించాడు. అదే సమయంలో రైటర్ గా ట్యాలెంట్ చూపిస్తూ మెగా ఫోన్ పట్టుకున్నాడు. మంచి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించి ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విలన్ రోల్స్ లో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడీ ట్యాలెంటెడ్ పర్సన్. ఇక బ్రహ్మాస్ర్త వంటి హిందీ సినిమాలు, అవతార్ వంటి హాలీవుడ్ సినిమాలకు తెలుగు డబ్బింగ్ కూడా చెప్పాడీ యాక్టర్. ఇలా సినిమా రంగంలో తన బహుముఖ ప్రతిభకు ప్రతీకగా రెండు నంది అవార్డులతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు కూడా అందుకున్నాడు. అతను మరెవరో కాదు శ్రీనివాస్ అవసరాల. ఇది అతని టీనేజ్ నాటి ఫొటో.

అష్టాచ‌మ్మ సినిమాతో ఎంట్రీ ఇచ్చారుఅవసరాల శ్రీనివాస్. ఆ త‌ర్వాత పలు సినిమాల్లోనూ సెకెండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియన్ గా నటించి మెప్పించాడు. అదే సమయంలో పలు సినిమాలకు రైటర్ గానూ వ్యవహరించారు. ఓ వైపు నటుడిగా రాణిస్తూనే మెగా ఫోన్ పట్టుకుని ‘ఊహ‌లు గుస‌గులాడే’ , ‘జోఅచ్యుతానంద’ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించారు శ్రీనివాస్. ఈ ఏడాది నాలుగు సినిమాల్లో నటించాడు అవసరాల. సంక్రాంతికి వస్తున్నాం, బాపు, సారంగపాణి జాతకం, అనగనగా వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు.

ఇవి కూడా చదవండి

శ్రీనివాస్ అవసరాల ఫొటోస్..

ఈటీవీ విన్ లో వచ్చిన కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ లో విలన్ గా నటించాడు శ్రీనివాస్. ప్రెసిడెంట్ ప్రకాశ్ రావ్ పాత్రలో ఆడియెన్స్ ను భయపెట్టాడు. ప్రస్తుతం శ్రీనివాస్ చేతిలో పలు సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.