AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండోసారి ఆ స్టార్ హీరోతో కలిసి నటిస్తున్న మమిత.. కానీ ఫస్ట్ సినిమా షూటింగ్ మధ్యలోనే..

మమితా బైజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రేమలు ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది మమితా బైజు 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'సర్వోపరి పాలక్కారన్' ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత చాలా సినిమాల్లో మమితా నటించింది.

రెండోసారి ఆ స్టార్ హీరోతో కలిసి నటిస్తున్న మమిత.. కానీ ఫస్ట్ సినిమా షూటింగ్ మధ్యలోనే..
Mamitha Baiju
Rajeev Rayala
|

Updated on: May 22, 2025 | 8:34 AM

Share

మలయాళం నుంచి చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. చిన్న చిన్న సినిమాలు కూడా అక్కడ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి సినిమాల్లో ప్రేమలు ఒకటి. ఈ సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దాంతో ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమిత బైజు పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినిమా చూసిన వారు. చక్కటి నటనతో ఆకట్టుందని అంటున్నారు. ప్రేమలు సినిమా తర్వాత ఈ చిన్నది చిన్న గ్యాప్ తీసుకుంది. మమిత నెక్స్ట్ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిన్నది స్టార్ హీరో సూర్య సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమం జరిగింది.

స్టార్ హీరో సూర్యకు ఈ మధ్య కాలంలో ఏది కలిసి రావడం లేదు.. చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు. ఏ జోనర్ సినిమాలు చేసిన అవి థియేటర్స్ లో రివర్స్ అవుతున్నాయి. సూర్య చేసిన కంగువ, రీసెంట్ గా వచ్చిన రెట్రో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మమిత బైజు నటిస్తుంది. అయితే గతంలో మమిత సూర్యతో కలిసి నటించింది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

మమిత బైజు ప్రేమలు సినిమా కంటే ముందు వణంగాన్‌ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా షూటింగ్ నుంచి ఆమె బయటకు వచ్చేసింది. ఆ సినిమా సమయంలో దర్శకుడు బాల తనను తిట్టాడని అంతటి ఆగకుండా కొట్టాడని ఆమె తెలిపింది. దాంతో ఆమె ఆ సినిమా నుంచి బయటకు వచ్చేసింది. ఈ సినిమాలో సూర్య హీరోగా నటించారు. ఆతర్వాత సూర్య కూడా ఈ సినిమా నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి మామిత,సూర్య కలిసి నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..