AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బూరెబుగ్గలు, చారడేసి కళ్లు..! ఈ చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. స్టార్ హీరో భార్య ఆమె

టాలీవుడ్​ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. అది కంటెంట్ విషయంలో కావొచ్చు.. ఆర్టిస్టుల విషయంలో కావొచ్చు. అందం, అభినయం ఉన్న అమ్మాయిలను మనవాళ్లు ఎప్పుడూ ఆదరిస్తునే ఉంటారు. అలా ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అన్నీ కలిసిస్తే దశాబ్ధాల పాటు వారికి అవకాశాలు వెల్లువలా వస్తాయి.

బూరెబుగ్గలు, చారడేసి కళ్లు..! ఈ చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. స్టార్ హీరో భార్య ఆమె
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: May 22, 2025 | 9:03 AM

Share

ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా తారల ఛైల్డ్‌ హుడ్‌ పిక్స్‌ నెట్టంట బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి. పుట్టిన రోజు అలాగే ప్రత్యేక సందర్భాల్లోనూ త్రో బ్యాక్‌ అంటూ సినీ తారలు తమ బాల్యం తాలూకూ జ్ఞాపకాల్లోకి వెళుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌, శాండల్‌ వుడ్‌.. అనే తేడా లేకుండా సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్క స్టార్స్‌ తమ అరుదైన ఫొటోస్‌ని షేర్‌ చేసుకుంటున్నారు. అలా తాజాగా మరో క్రేజీ హీరోయిన్‌ చిన్న నాటి ఫొటో ఒక్కటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పై ఫొటోను చూశారు కదా.. ఇందులో ఉన్నది ప్రముఖ తెలుగు హీరోయిన్‌. అయితే తమిళ్‌, హిందీ, మలయాళ భాషా సినిమాల్లోనూ సత్తాచాటింది. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలలోనూ హాట్ టాపిక్ గా మారింది ఆ చిన్నది.. టాలీవుడ్ స్టార్ హీరోను ప్రేమించి పెళ్లాడింది ఆ భామ. ఇప్పటికే అర్ధమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.

ఆమె మరెవరో కాదు.. ఇటీవల పొన్నియన్‌ సెల్వన్‌  సినిమాలో వనితగా మెప్పించిన శోభిత ధూళిపాళ. హిందీతో పాటు సౌత్ సినిమా ఇండస్డ్రీలో వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ తెలుగమ్మాయి తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. శోభిత హిందీ సినిమాతో తెరంగేట్రం చేసింది. నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా తెరకెక్కిన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.

ఆ తర్వాత అడవి శేష్‌ గూడఛారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఘోస్ట్‌ స్టోరీస్‌ (హిందీ), కురుప్‌ (మలయాళం), మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్‌ సిరీస్‌ సినిమాలతో సినిమా ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇక ఈ ముద్దుగుమ్మ అక్కినేని అందగాడు నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో చైతూ, శోభిత లవ్లీ కపుల్ గా పేరుతెచ్చుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్