
నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు ఇండస్ట్రీలో తన నటనతో కోట్లాది మందిని సొంతం చేసుకున్న పేరు ఇది. సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఆయన డాన్స్ కు, నటనకు, డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే నటుడు ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోల్లో బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే చాలా మంది చెప్పే పేరు ఎన్టీఆర్. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ కంటే ముందు నుంచే తారక్ కు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ ఫ్యాన్స్ డబుల్ , త్రిబుల్ అయ్యారు.
ఎన్టీఆర్ గురించి దాదాపు అందరికి తెలిసిందే.. కానీ ఆయన గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం కూడా ఒకటుంది. ఎన్టీఆర్ కు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా ఆయన బ్యాట్ మెంటన్ ఎక్కువగా ఆడతారు అంతే కాదు. బ్యాట్మెంటెన్ లో ప్రొఫిషనల్ ఆయన. ఇదే విషయాన్నీ తారక్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే యంగ్ హీరో సుధీర్ బాబు కూడా తారక్ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఎన్టీఆర్ ప్రొఫిషనల్ బ్యాట్మెంటెన్ ప్లేయర్. ఆయన డబుల్ ఎక్కువగా ఆడేవారు. ఆయన ఆట చూడటానికి భారీగా జనాలు వచ్చేవారు. అంతే కాదు బ్యాట్మెంటెన్ ఆడుతూ తొడకొట్టేవారు అని తెలిపాడు సుధీర్ బాబు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది. ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! Wishing you all a very Happy New Year.
Can’t wait for you all to experience the glimpse of #Devara on Jan 8th. pic.twitter.com/RIgwmVA6e0
— Jr NTR (@tarak9999) January 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.