AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ సినిమాకంటే ముందే తెలుగులో ప్రియాంక.. ఆ ఇద్దరు హీరోలతో కలిసి సినిమా.. కానీ

ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ SSMB 29. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచస్థాయిలో చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ రేంజ్ లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.

మహేష్ సినిమాకంటే ముందే తెలుగులో ప్రియాంక.. ఆ ఇద్దరు హీరోలతో కలిసి సినిమా.. కానీ
Priyanka Chopra
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2025 | 1:10 PM

Share

ఇప్పుడు అందరి కళ్ళు మహేష్ బాబు, రాజమౌళి సినిమా పైనే ఉన్నాయి. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్ సినిమా పై హైప్ ను ఆకాశానికి చేర్చాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులందరిలో ఆసక్తి మొదలైంది. ఇదిలా ఉంటే ఈ నెల 15న జరగనున్న గ్లోబల్ ట్రోటర్ కోసం ఫ్యాన్ అందరూ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్ లో రాజమౌళి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వనున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రియాంక చోప్రా నటిస్తున్న తోలి తెలుగు సినిమా ఇది.. అయితే తెలుగులో ప్రియాంక నటిస్తున్న తొలి సినిమా ఇది కాదు. గతంలో ప్రియాంక చోప్రా తెలుగులో నటించింది. ఆమె ఏకంగా ఇద్దరు హీరోలతో కలిసి ఓ సినిమాలో నటించింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ హీరోలు ఎవరో తెలుసా.? ఆ సినిమా పేరు మరేదో కాదు.. ఆ సినిమా పేరు అపురూపం. 2002లో ప్రియాంక చోప్రా తమిళ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో తెలుగులోనూ సినిమా చేసింది. ఈ సినిమాలో మధుకర్, ప్రసన్న ఇద్దరు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమాకు జి.యస్‌. రవికుమార్‌  దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. ఆతర్వాత బాలీవుడ్ కు వెళ్లిన ప్రియాంక అక్కడ స్టార్ గా మారిపోయింది. ఇక తెలుగు స్టార్ రామ్ చరణ్ తో కలిసి జంజీర్ అనే సినిమా చేసింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు మహేష్ బాబు సినిమాతో మరోసారి తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మహేష్ బాబు సినిమాలో ప్రియాంక మందాకినీ అనే పాత్రలో కనిపించనుంది.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us