Rashmika Mandanna: నేషనల్ క్రష్ గ్లోబల్ ఎంట్రీ… ఏ మూవీతో..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొరియన్ డ్రామాలలో నటించాలని తన ఆసక్తిని వెల్లడించారు. కోవిడ్ సమయంలో కొరియన్ డ్రామాలు చూసి, అవి చాలా సరదాగా ఉంటాయని ఆమె తెలిపారు. అవకాశం వస్తే కొరియన్ ప్రాజెక్టులలో నటించేందుకు సిద్ధమని చెప్పారు. త్వరలోనే రష్మిక విదేశీ స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
వరుస సినిమాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మిక మందన్న ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. తనకు ఓ విదేశీ భాషలో సినిమా చేయాలనుందంటున్నారు ఈ బ్యూటీ. రష్మికను అంతగా ఇంప్రెస్ చేసిన ఆ ఫారిన్ ఇండస్ట్రీ ఏంటి..? మరి ఆ భాషలో రష్మికకు ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉందా..? సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఓ వైపు కమర్షియల్ సినిమాలో గ్లామర్ రోల్స్ చేస్తూనే మరో వైపు బోల్డ్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నారు. రష్మిక సినిమాలు కమర్షియల్‌గానూ మంచి నెంబర్స్ రికార్డ్ చేస్తుండటంతో మోస్డ్ వాంటెడ్‌గా మారారు ఈ బ్యూటీ. ఇంత బిజీగా ఉన్న రష్మిక… తనకు కొరియన్ డ్రామాలో నటించాలనుందంటున్నారు. కొవిడ్ టైమ్‌లో అందరిలాగే తాను కూడా కొరియన్ డ్రామాలు చాలా చూశానన్న రష్మిక, అవి చాలా ఫన్‌గా ఉంటాయని, తనకు కూడా అలాంటి ప్రాజెక్ట్స్‌లో నటించాలనుందన్నారు. ఛాన్స్ వస్తే కొరియన్ డ్రామాలో చేసేందుకు రెడీ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ కొరియన్ మేకర్స్ తనకు సూట్ అయ్యే కథ తీసుకువస్తే ఖచ్చితంగా నటిస్తానని చెప్పారు. ‘కొరియన్ డ్రామాలు ఏవైనా 16 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే అందులో నటిస్తే 16 గంటల పాటు మనం తెర మీద కనిపిస్తాం’ అంటూ తన ఇంట్రస్ట్‌ను రివీల్ చేశారు. రష్మిక మాట్లాడింది చూస్తే త్వరలోనే ఆమె కొరియన్ డ్రామాలో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్‌గా ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రజెంట్ కాక్‌టైల్ 2, మైసా సినిమాల్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండు చేతులూ లేకపోయినా బైక్‌పై దూసుకెళ్లిన..
రైలు కదిలిపోతోంది.. నా పైసలు ఇచ్చెయ్ అన్నా.. ప్లీజ్
వేగంగా దూసుకెళ్తున్న కారు.. సైడ్ మిర్రర్ నుంచి సైలెంట్‌గా వచ్చిన పాము.. కట్ చేస్తే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

