అది రైలు బ్రో.. మన ఇల్లు కాదు.. అలా ఎలా చేస్తావ్ ??
రీల్స్ పిచ్చితో ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు రైలు కోచ్‌లో స్నానం చేసి వీడియో తీశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు ఆ యువకుడిని గుర్తించి, అతనిపై చర్యలు తీసుకున్నారు. అతని యూట్యూబ్ ఛానెల్ నుండి వీడియోను తొలగింపజేశారు. ఇలాంటి చర్యలు రైళ్లలో చేయవద్దని రైల్వే హెచ్చరించింది.
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని చాలామంది యువకులు ఎక్కడపడితే అక్కడ రకరకాల వీడియోలు చేస్తారు. ఈ మధ్యకాలంలో నడిరోడ్డుపై బైకులపై యువతీ యువకులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసిన ఘటనలు నెట్టింట చూశాం. తాజాగా ఓ యువకుడు రీల్స్ కోసం రైల్లో చేసిన పనికి రైల్వే అధికారులు అతనిపై చర్యలు చేపట్టారు. అతని యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియోను తొలగించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మోత్ పట్టణానికి చెందిన ప్రమోద్ శ్రీనివాస్ అనే యువకుడు నవంబరు 1న ఆగ్రా వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ ఓ జనరల్ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌లోని యార్డ్‌లో నిలిచి ఉన్న రైలులోకి ప్రమోద్ శ్రీనివాస్ ఎక్కాడు. ఒక స్లీపర్ కోచ్‌లో కొద్ది మంది ప్రయాణికులే ఉండటంతో అక్కడ రీల్ చేద్దామని ప్రయత్నించాడు. ఒక బకెట్‌లో నీళ్లు తెచ్చుకున్నాడు. కంపార్ట్‌మెంట్ డోర్ వద్ద స్నానం చేశాడు. తలకు షాంపు రుద్దుకొని మగ్గుతో నీళ్లు పోసుకున్నాడు. రీల్ రికార్డ్ చేసిన తర్వాత ఆ రైలు దిగి, ఆగ్రా వెళ్లే రైలు ఎక్కాడు. రైలు కోచ్‌లో స్నానం చేసిన వీడియోను అతడి యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో రైల్వే స్పందించింది. స్లీపర్ కోచ్‌లో స్నానం చేసిన యువకుడిని రైల్వే పోలీసులు గుర్తించారు. అతడిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు రైల్వే పేర్కొంది. ఆ యువకుడు తన చర్యలకు క్షమాపణ చెప్పాడని, యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియో తొలగించినట్లు వెల్లడించింది. రైళ్లలో ఎవరూ ఇలాంటివి చేయవద్దని రైల్వే సూచించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈమె టెక్నిక్ చూస్తే.. ప్రతి ఇంట్లో ఆడోళ్లు ఇలానే చేస్తారేమో.. ఐడియాకి సెల్యూట్ చెయ్యాల్సిందే
సూట్‌కేసులో నుంచి వింత శబ్దాలు.. ఓపెన్ చేసి చూడగా షాక్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

