AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఒక్కపీత ఖరీదు నాలుగు వేలా ??

వామ్మో.. ఒక్కపీత ఖరీదు నాలుగు వేలా ??

Phani CH
|

Updated on: Nov 14, 2025 | 10:52 AM

Share

కాకినాడ జిల్లా తాళ్లరేవులో మత్స్యకారుడికి 2 కేజీల బరువున్న అరుదైన భారీ పీత వలలో చిక్కింది. సాధారణం కంటే పెద్దదైన ఈ పీతను రూ.4000కు విక్రయించారు. పెద్దవలసల గ్రామ ప్రజలకు పీతల వేట జీవనాధారం కాగా, ఈ అరుదైన క్యాచ్ మత్స్యకారుడికి అనూహ్య ఆనందాన్ని, లాభాన్ని అందించింది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

గోదావరి జిల్లాల ప్రజలకు పులసలు అంటే ఎంత ఇష్టమో.. పీతలు అంటే కూడా అంతే ఇష్టంగా తింటారు. పులసల పులుసు ఎంత ఫేమస్సో పీతల పులుసు కూడా అంతే ఫేమస్‌ ఇక్కడ. మార్కెట్లో పీతలు కనపడ్డాయంటే పోటీపడి మరీ కొంటుంటారు. సాధారణంగా ఒక్కోపీత 100 నుంచి 200 గ్రాముల బరువుతో పెరుగుతాయి. అయితే తాజాగా మత్స్యకారులకు ఓ భారీ పీత దొరికింది. దాన్ని చూసి ఎప్పుడూ ఇంత పెద్ద పీతను చూడలేదే అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పీతను చూసేందుకు స్థానిక మత్స్యకారులు భారీగా గుమిగూడారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పీతలకు పెట్టింది పేరు. కోరంగి పంచాయతీ పెద్దవలసల గ్రామస్థులు పీతలు వేటాడుతూ జీవనం సాగిస్తారు.చిన బొడ్డు వెంకటాయపాలెం కు చెందిన సంగాడి కామేశ్వరరావు రోజూలాగే సముద్రంలో వేటకు వెళ్లి వలవేయగా పసుపు రంగులో ఉన్న ఓ భారీ పీత తన వలలో చిక్కంది. అది ఏకంగా రెండు కీజీల బరువు తూగింది. దీనిని ఒక వ్యక్తి నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేసాడు. పెద్దవలసల గ్రామంలో 400 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 90 శాతం మంది పీతల వేట జీవనాధారం. సాధారణంగా ఈ పీతల బరువు 100 గ్రాముల నుండి 190 గ్రాములు ఉంటుంది. కేజీ పీతల ధర 250 నుంచి 350 రూపాయలు పలుకుతుంది. రెండు కేజీల బరువు తూగిన ఈ ప్రత్యేకమైన పీత 4 వేల రూపాయలకు అమ్ముడుపోవడంతో మత్స్యకారుడు ఆనందంలో మునిగిపోయాడు. పీతల అమ్మకానికి పెదవలసలలో ప్రత్యేక మార్కెట్ ఉంది. ఇక్కడి నుంచే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలు మూలల చేపల మార్కెట్లలో పీతలు విక్రయిం చేందుకు మహిళలు తీసుకెళ్తారు. భారీ మొత్తంలో కాకినాడ పోర్టుకు అక్కడి నుంచి కలకత్తా,చైనా కు తరలిస్తారు.ఒక్కో మత్స్యకారుడు రోజుకు 500-900 రూపాయలు సంపాదిస్తారు.ఒక పడవ పై పది మంది వరకు వెళ్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది తల్లి ప్రేమ మాత్రమే కాదు.. అంతకు మించి!