సూట్‌కేసులో నుంచి వింత శబ్దాలు.. ఓపెన్ చేసి చూడగా షాక్
ఐర్లాండ్‌లోని సిటీలింక్ బస్సులో ఓ వింత సంఘటన వెలుగుచూసింది. లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో సూట్‌కేస్‌లో శబ్దాలు వినిపించడంతో సిబ్బంది తెరిచి చూశారు. అందులో ఒక మహిళ భయంతో బయటకు వచ్చింది. అక్రమంగా ప్రయాణించేందుకు సూట్‌కేస్‌లో దాక్కున్నట్లు పోలీసులు వెల్లడించారు. సిబ్బంది అప్రమత్తత వల్ల ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
ఐర్లాండ్‌లో వింత సంఘటన జరిగింది. సిటీలింక్ బస్సు లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ ఉంది. వాటిలో ఓ పెద్ద సూట్‌కేసులోనుంచి ఏవో శబ్ధాలు వినిపించాయి. వెంటనే అలర్టయిన సిబ్బంది, అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు సూట్‌కేస్ తెరవడానికి అనుమతి ఇవ్వడంతో సూట్‌కేస్ తెరిచి చూశారు. అందులో ఓ మహిళ ఉండటం చూసి షాకయ్యారు. ఆమె బ్రతికే ఉంది. గాల్వేకు వెళ్తున్న బస్సులో ఈ వింత సంఘటన జరిగింది. కాగా, ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో నుండి సూట్‌కేస్‌ను బయట పడేయగానే, లోపలి నుండి అరుపులు వినిపించాయి. దాంతో వెంటనే సిబ్బంది అధికారుల అనుమతితో సూట్‌కేస్ ఓపెన్ చేశారు. అందులోంచి ఒక మహిళ భయంతో బయటకు వచ్చింది. నువ్వు ఈ సూట్‌కేస్ లోపలికి ఎలా వెళ్లావు అని సిబ్బందిని ఆమెను ప్రశ్నించారు. ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండా థ్యాంక్ గాడ్ .. థ్యాంక్‌గాడ్ అంటూ నేలపై కూర్చుని తల పట్టుకుంది. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ అనధికార ప్రయాణీకురాలిగా పోలీసులు వెల్లడించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నామని సిటీలింక్ అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మహిళ అక్రమంగా బస్సులో ప్రయాణించాలనుకుంది. అందుకే తనను తాను సూట్‌కేసులో బంధించుకొని లగేజ్‌లాగా ప్రయాణించాలని భావించిందని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ, ఆమె ప్రాణాలతో బయటపడింది.. లేదంటే, ఊపిరాడక మృతిచెంది ఉండేదని, సిబ్బంది అప్రమత్తత వల్ల ప్రమాదం తప్పిందని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్

