AlluArjun : అల్లు అర్జున్ మిస్ చేసుకున్న సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన యంగ్ హీరో.. ఆ మూవీ ఎదో తెలుసా.?

అల్లు అర్జున్ మిస్ చేసుకున్న సినిమాతో ఓ యంగ్ హీరో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. మరికొన్ని గంటల్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలకానుంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిమాక మందన్న నటిస్తుంది.

AlluArjun : అల్లు అర్జున్ మిస్ చేసుకున్న సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన యంగ్ హీరో.. ఆ మూవీ ఎదో తెలుసా.?
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 04, 2024 | 12:38 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు (గురువారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దేశంలోనే ప్రముఖ హీరోల్లో ఒకరిగా అల్లు అర్జున్ పేరు సొంతం చేసుకున్నారు . అంతే కాదు జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టారు. విజేత, స్వాతిముత్యం సినిమాల్లో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టాడు. ఇదిలా ఉంటే హీరోగా మారిన తర్వాత ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు అల్లు అర్జున్.

ఇది కూడా చదవండి :Allu Arjun : పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ట్వీట్

కాగా అల్లు అర్జున్ మిస్ చేసుకున్న సినిమాతో ఓ యంగ్ హీరో భారీ హిట్ అందుకున్నాడు. ఇంతకూ ఆ సినిమా ఎదో.. ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా.? అవును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ భారీ హిట్ సినిమాను మిస్ చేసుకున్నారు. ఆ సినిమా ఎదో కాదు తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన జయం . అవును జయం సినిమాను ముందుగా అల్లు అర్జున్ చేయాల్సింది. కానీ ఆ సినిమా మిస్ అయ్యింది.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

నిజానికి జయం సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సి ఉందట.. కానీ అది జరగలేదు. ఆతర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ గా.. ఆతర్వాత ఐకాన్ స్టార్ గా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక అల్లు అర్జున్ మిస్ చేసుకున్న జయం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇది కూడా చదవండి :Nargis fakhri : మాజీ బాయ్ ఫ్రెండ్‌ను హత్య చేసిన స్టార్ హీరోయిన్ సోదరి.. అరెస్ట్ చేసిన పోలీసులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.