Adi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి సోదరి గొప్ప మనసు.. కంటి చూపులేకపోయినా తన పెన్షన్ డబ్బులను విరాళంగా ఇచ్చి మరీ..

బిగ్ బాస్ ఫేమ్ ఆది రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 6 లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన అతను తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. మరి ఆది రెడ్డికి కంటి చూపు లేని ఒక సోదరి ఉందనే విషయం తెలుసా?

Adi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి సోదరి గొప్ప మనసు.. కంటి చూపులేకపోయినా తన పెన్షన్ డబ్బులను విరాళంగా ఇచ్చి మరీ..
Adi Reddy Sister And Wife

Updated on: Mar 25, 2025 | 7:57 PM

బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది రెడ్డి. ఆరో సీజన్ లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి ఫైనల్ రౌండ్ వరకు చేరుకోగలిగాడు ఆది రెడ్డి. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా తనదైన శైలిలో బిగ్ బాస్ షో రివ్యూలు చెబుతూ బాగానే పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే ఈ విషయాలు చాలా మందికి తెలిసినవే. కానీ ఆదిరెడ్డికి ఒక సోదరి ఉంది. ఆమెకు పుట్టుకతోనే దృష్టి లోపం ఉంది. అయితేనేం తన ప్రతిభతో అందరి మన్ననలు అందుకుంటోంది. ఆమె ఫేమస్ యూట్యూబర్ బొడ్డు నాగ లక్ష్మి. యూట్యూబ్ బాగా ఫాలో అయ్యే వారికి ఈమె గురించి తెలిసే ఉంటుంది. ‘ హాయ్‌ అండీ.. నేను మీ నాగలక్ష్మి.. వెల్‌కమ్‌ టు కవిత నాగ వ్లాగ్స్‌ ( Kavitha Naga Vlogs )’ అంటూ నాగ లక్ష్మి చేసే వీడియోలకు మంచి స్పందన వస్తుంటుంది. వంట, ఔటింగ్‌, ప్రొడక్ట్‌ మేకింగ్‌.. తదితర అంశాలకు నాగ లక్ష్మి చేసే వీడియోలు యూట్యూబ్ లో బాగా ఫేమస్. ప్రస్తుతం నాగ లక్ష్మి యూట్యూబ్ ఛానెల్ కు 5.82 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు నాగ లక్ష్మి కి ఉన్న ఫాలోయింగ్ ఏపాటిదో.

సంపాదనలో కొంతం సామాజిక సేవకే..

అన్నట్లు కంటి చూపు లేకపోయినా అందరూ బాగుండాలను కోరుకుంటుంది నాగ లక్ష్మి. అందుకే తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకు కేటాయిస్తుంటుంది. ముఖ్యంగా కోవిడ్ కష్ట కాలంలో నాగ లక్ష్మి చేసిన ఒక మంచి పనితో దేశ వ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోయింది. తన ఐదు నెలల దివ్యాంగ పెన్షన్ డబ్బులు రూ. 15 వేలను సోనూ సూద్ ఛారిటీ ఫౌండేషన్ కు విరాళంగా పంపించిందామె. దీంతో సోనూ సూద్ కూడా ఆమెను ఏ ట్రూ హీరో ప్రశంసలతో ముంచెత్తాడు. అప్పుడే నాగ లక్ష్మి పేరు మొదటి సారిగా అందరి నోళ్లలో నానింది.

ఇవి కూడా చదవండి

సోనూ సూద్ ప్రశంసలు..

ప్రస్తుతం తన అన్న, వదినలతోనే కలిసి ఉంటోంది నాగ లక్ష్మి. ముఖ్యంగా వదినతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. ఆమెతో కలిసి వీడియోలు కూడా చేస్తుంటుంది. వాటిని తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తుంటుంది. వీటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

అన్న, వదినలతో కలిసి నాగ లక్ష్మి..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .