
సీనియర్ హీరో భాను చందర్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 80-90వ దశకంలో తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోగా వెలుగొందారాయన. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఈ నటుడు యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. 1978లో వచ్చిన మన ఊరి పాండవులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు భాను చందర్. మొదటి మూవీతోనే ట్యాలెంటెడ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బెబ్బులి, ఆడవాళ్లు మీకు జోహార్లు, సత్యం శివం, వంశ గౌరవం, ఇద్దరు కిలాడీలు, మెరుపు దాడి, రేచుక్క, పున్నమి రాత్రి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించాడు భాను చందర్. 1986లో వచ్చిన నిరీక్షణ సినిమా ఈ నటుడి సినిమా కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో భానుచందర్ నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. పలు అవార్డులు కూడా ఆయనకు వచ్చాయి. అలాగే ‘కీచురాళ్లు’ సినిమా కూడా భాను చందర్‌కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. యాక్షన్ హీరోగా ఓ వెలుగు వెలిగిన భాను చందర్ ఆ తర్వాతి కాలంలో సహాయక నటుడిగానూ మెప్పించారు. ముఖ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలు పోషిస్తూ అభిమానులను అలరిస్తున్నారీ సీనియర్ నటుడు. దేవి, సింహాద్రి, స్టైల్, దుబాయ్ శీను తదితర సినిమాల్లో భాను చందర్ కీలక పాత్రలు పోషించాడు. ఆ మధ్యన వచ్చిన రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్), మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాల్లో భాను చందర్ సహాయక నటుడిగా కనిపించారు.
సినిమాల సంగతి పక్కన పెడితే భాను చందర్ కు భార్య స్వర్ణ, ఇద్దరు కుమారులు జయంత్, నిషాంత్ ఉన్నారు. అయితే భాను చందర్ కుమారుడు కూడా తెలుగులో క్రేజీ హీరో అనే విషయం చాలా మందికి తెలియదు. అతని పేరు జయంత్. తండ్రి అడుగు జాడల్లోనే నడిచిన జయంత్ ‘నా కొడుకు బంగారం’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి భాను చందరే ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. దీంతో పాటు తమిళంలో మర్గాజీ 16 అనే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా చేశాడు జయంత్. అయితే ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి. దీంతో వీటి తర్వాత సినిమాలు చేయలేకపోయాడు జయంత్.
Bhanu Chander Son Jayanth
My family photo
my sons #Jayanth #Nishanth & my wife #Swarna & me pic.twitter.com/72A4CmpUoY— Bhanu Chander (@Bhaanu_chandar) September 13, 2017
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..