నయనతారలో ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోంది. ఎప్పుడూ లేనిది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొన్న మొన్నటిదాకా టచ్ మీ నాట్ అన్నట్టు ఉండే బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో మిగిలిన హీరోయిన్లతో కలుస్తున్నారు.
ఈ ఏడాది సమంతతో కలిసి నయన్ చేసిన సినిమా కణ్మణి రాంబో ఖతీజా. ఈ సినిమాలో సమంతతో అక్కా అని కూడా పిలిపించుకున్నారు నయన్. ఆమె ఇండస్ట్రీకి వచ్చింది. ఇండస్ట్రీని గమనించింది. ఇండస్ట్రీని అధ్యయనం చేసింది. పోరాడింది. గెలిచింది. షి ఈజ్ క్వీన్ అని నయన్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా పోస్టు కూడా చేశారు సామ్. అంతలా ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కుదిరింది.
ఈ మధ్య నయనతారకు అలాంటి ఫ్రెండ్‌షిప్పే త్రిషతో కుదిరిందంటోంది చెన్నై మీడియా. అజిత్ హీరోగా విఘ్నేష్ శివన్ డైరక్షన్లో తెరకెక్కే సినిమాలో త్రిషను హీరోయిన్‌గా తీసుకోమని నయన్ సజెస్ట్ చేశారట. అంతకు ముందు నయన్‌కి, త్రిషకీ పడేది కాదన్నది కోడంబాక్కం న్యూస్. అయితే ఇప్పుడు అంతా సవ్యంగా నడుస్తోందని, ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కుదిరిందని అంటున్నారు చెన్నై జనాలు. నయనతారకి 2023 చాలా కీలకమైన సంవత్సరం. సౌత్‌లో చేస్తున్న సినిమాలతో పాటు నార్త్ లో జవాన్ కూడా కొత్త సంవత్సరంలోనే రిలీజ్ అవుతుంది నయనతారకు.