Dhruva: రామ్ చరణ్ ధ్రువ మూవీలో విలన్ పాత్రను మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా..? ఆయన చేసుంటే..
ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కిన తని ఒరువన్ సినిమా రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. ఇక ధ్రువ సినిమాలో చరణ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి ఆకట్టుకున్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ధ్రువ సినిమా ఒకటి. టాలీవుడ్ లో స్టైలిష్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కిన తని ఒరువన్ సినిమా రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. ఇక ధ్రువ సినిమాలో చరణ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీలో విలన్ గా ప్రముఖ నటుడు అరవింద్ స్వామి నటించిన విషయం తెలిసిందే. అరవింద్ స్వామి హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు ఇక ఈ సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.
అయితే ఈ సినిమాలో ముందుగా విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామిని కాకుండా మరో నటుడిని అనుకున్నారట. ధ్రువ సినిమా మిస్ చేసుకున్న ఆ నటుడు ఎవరో తెలుసా..? ఆయనే కింగ్ నాగార్జున. సురేందర్ రెడ్డి ముందుగా విలన్ పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారట.
అయితే కథ విన్న తర్వాత ఓకే కూడా చెప్పారట.. కానీ ఆతర్వాత నో చెప్పారని తెలుస్తుంది. అలాగే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను కూడా సంప్రదించారట. కానీ కన్నడలో స్టార్ హీరోగా రాణిస్తున్న ఆయన నెగిటివ్ పాత్రలో నటించని చెప్పారట. దాంతో తమిళ్ లో నటించిన అరవింద్ స్వామినే తీసుకున్నారట.
Nagarjuna
