Actress: చిరంజీవితో బ్లాక్ బస్టర్ మూవీ.. కట్ చేస్తే 17 ఏళ్లకే ఉరేసుకుని ఆత్మహత్య.. పాపం ఈ హీరోయిన్ ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచంలాంటిది. బయట చూడడానికి కూడా చాలా బాగా అందంగా కనిపిస్తుంటుంది. అయితే ఈ తళుకులు, మెరుపుల వెనక చాలా మందికి తెలియని ఓ చీకటి ప్రపంచం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్లు నిలదొక్కుకోవాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Actress: చిరంజీవితో బ్లాక్ బస్టర్ మూవీ.. కట్ చేస్తే 17 ఏళ్లకే ఉరేసుకుని ఆత్మహత్య.. పాపం ఈ హీరోయిన్ ఎవరంటే?
Tollywood Actress

Updated on: May 14, 2026 | 2:04 PM

సినిమా ఇండస్ట్రీ కనిపించడానికి చాలా అందంగా ఉంటుంది. అయితే అక్కడ చాలా మందికి తెలియని ఓ చీకటి ప్రపంచం కూడా ఉంటుంది. ముఖ్యంగా తెరమీద అందంగా మెరిసిపోయే తారల వెనుక ఎన్నో కన్నీటి కథలు దాగి ఉంటాయి. అలాంటి కన్నీటి కథే ఈ హీరోయిన్ ది. నాలుగేళ్ల వయసులోనే బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా మెప్పించింది. పిన్న వయసులోనే జాతీయ అవార్డు కూడా అందుకుంది. కానీ ఎంత త్వరగా స్టార్ గా ఎదిగిందో, అంతే త్వరగా తన ప్రస్థానాన్ని ముగించేసింది. కేవలం 17 ఏళ్లకే ఈలోకాన్ని విడచి పెట్టి వెళ్లిపోయింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? ఈ తరం ఆడియెన్స్ కు ఈమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ 80-90 జనరేషన్ కు ఈ అందాల తార గురించి బాగా తెలుసు.

మద్రాసులోని ఒక మలయాళ కుటుంబంలో పుట్టింది శోభ. తల్లి ప్రేమ కూడా ప్రముఖ నటి కావడంతో ఆమె కూడా చిన్న తనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం నాలుగేళ్ల వయసులోనే బాలనటిగా కెమెరా ముందుకు వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్లకు హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్రారంభంలో నటించిన ‘మన ఊరి పాండవులు’ (1978) సినిమాలో శోభ హీరోయిన్ గా నటించింది. అంతకు ముందు తరం మారింది అనే తెలుగు సినిమాలోనూ నటించిందీ అందాల తార. అలాగే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక 1979లో రిలీజైన పసి అనే సినిమా శోభకు ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది. ఇందులో ఆమె మురికివాడలో చెత్త ఏరుకుంటూ, పెళ్ళైన వ్యక్తి వలలో పడి మోసపోయే ‘కుప్పమ్మ’ పాత్రలో అద్బుతంగా నటించింది. ఎంతలా అంటే కేవలం 17 ఏళ్ల వయసులోనే నేషనల్ అవార్డ్ అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇల శోభా సినిమా కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్లుతోన్న సమయంలోనే ఆమె జీవితంలోకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ దర్శకుడు బాలు మహేంద్ర ఎంట్రీ ఇచ్చారు. బాలు మహేంద్ర, కమల్ కాంబినేషన్ లో వచ్చిన కోకిల సినిమాలో శోభనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే బాలు మహేంద్ర, శోభలు దగ్గరయ్యారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అప్పటికే ఆయనకు అఖిల అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాదు శోభ కంటే బాలు మహేంద్ర వయసులో 26 ఏళ్లు పెద్దవారు. దీంతో శోభ పేరెంట్స్ వీరి పెళ్లికి నో అన్నారు. కానీ అందరినీ ఎదిరించి శోభ 1978లో బాలు మహేంద్రను పెళ్లి చేసుకుంది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. బాలు మహేంద్ర మళ్లీ తన మొదటి భార్య దగ్గరకు వెళ్లిపోయాడు. దీంతో శోభ బాగా కుంగిపోయింది. బాలు మహేంద్రతో తరచూ గొడవలు పడింది. చివరకు 1980 మే 1వ తేదీన శోభ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి ఆమె వయసు కేవలం 17 ఏళ్ల 7 నెలలు మాత్రమే. అప్పట్లో శోభా మరణం సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది.

నటి శోభ ఫొటోలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us