Vasudheva Sutham : హీరోగా మారిన దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఆకట్టుకుంటున్న వసుదేవ సుతం గ్లింప్స్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా సినీరంగంలో రాణించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం భాషలలోనూ బాలనటీనటులు ఇప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. తాజాగా మరో చైల్డ్ ఆర్టిస్టు హీరోగా మారారు. అతడే దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్టు మాస్టర్ మహేంద్రన్.

దక్షిణాది సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించి మెప్పించాడు మాస్టర్ మహేంద్రన్. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ తెలుగులో ఒకప్పుడు సూపర్ హిట్ అయిన దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్. ఈ మూవీలో బాలనటుడిగా మెప్పించాడు. ఈ సినిమాకు తన నటనగానూ ఏకంగా నంది అవార్డ్ అందుకున్నాడు. దేవి సినిమాతోపాటు తెలుగులో మరికొన్ని చిత్రాల్లో నటించాడు మాస్టర్ మహేంద్రన్. ఇన్నాళ్లు బాలనటుడిగా కనిపించిన మహేంద్రన్.. ఆ తర్వాత చదువుల నిమిత్తం సినిమాలకు దూరమయ్యాడు. ఇక చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు మాస్టర్ మహేంద్రన్. తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ కుర్రాడు ఇప్పుడు హీరోగా మారాడు. వసుదేవ సుతం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రెయిన్ బో సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మెలోడీ బ్రహ్మా మణిశర్మ చేతుల మీదుగా వసుదేవ సుతం సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జగన్నాథుడి గుడి, అందులో పాము కనిపిస్తున్నాయి. గుడి చుట్టూ తిరిగే మైథలాజికల్ సినిమా అని తెలుస్తోంది. గ్లింప్స్ తోనే సినిమాపై మరింత క్యూరియాసిటి కలిగించారు. ఈ చిత్రానికి మణిశర్మనే మ్యూజిక్ అందిస్తున్నారు.
తెలుగుతోపాటు తమిళం, హిందీ, ఒరియా భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. మాస్టర్ మహేంద్రన్ చైల్డ్ ఆర్టిస్టుగా ఆహా, దేవి, పెళ్లి చేసుకుందాం, నీ స్నేహం, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాల్లో నటించాడు. దక్షిణాదిలో అన్ని భాషలలో కలిపి మొత్తం 130 చిత్రాల్లో నటించాడు మాస్టర్ మహేంద్రన్. ఇక ఇప్పుడు హీరోగా తెలుగు సినీప్రియులను అలరించేందుకు రెడీ అయ్యాడు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..
