AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya : అనుమతి లేకుండా నాగ చైతన్య పేరు, ఫోటో వాడకూడదు.. వ్యక్తిత్వ హక్కులకి మధ్యంతర రక్షణ కల్పించిన హైకోర్టు..

అనుమతి లేకుండా తన పేరు, ఫోటోస్ దుర్వినియోగం చేస్తున్నారని.. వాటిని అడ్డుకోవాలని ఇటీవల హీరో నాగ చైతన్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. నాగ చైతన్య వ్యక్తిత్వ హక్కులకి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.

Naga Chaitanya : అనుమతి లేకుండా నాగ చైతన్య పేరు, ఫోటో వాడకూడదు.. వ్యక్తిత్వ హక్కులకి మధ్యంతర రక్షణ కల్పించిన హైకోర్టు..
Naga Chaitanya
Gopikrishna Meka
| Edited By: |

Updated on: May 29, 2026 | 2:33 PM

Share

ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగచైతన్య వ్యక్తిత్వ హక్కులను అనధికారికంగా ఉపయోగించడం నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హీరో అక్కినేని నాగ చైతన్య పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా పోర్నోగ్రాఫిక్ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ మెర్చండైజ్ విక్రయాలు వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో దుర్వినియోగం చేస్తున్నారని నాగచైతన్య తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.నాగచైతన్య తరఫున సీనియర్ అడ్వకేట్ వైభవ్ గగ్గర్ వాదనలు వినిపిస్తూ, కొన్ని వెబ్‌సైట్లు నాగ చైతన్య పేరును అసభ్య పదాలతో కలిపి సెర్చ్ ఫలితాల్లో చూపించి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయని, నాగచైతన్య ఫోటోలు ముద్రించిన టీ-షర్టులు, ఇతర మెర్చండైజ్ వస్తువులను అనధికారికంగా విక్రయిస్తున్నట్లు ఆన్‌లైన్ లిస్టింగ్‌లు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

AI ద్వారా సృష్టించిన, మార్ఫింగ్ చేసిన కంటెంట్ వల్ల నటుడి వ్యక్తిగత జీవితం, గత సంబంధాలపై అభ్యంతరకరమైన వీడియోలు, పోస్టులు కూడా ప్రచారంలో ఉన్నాయని పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు…పోర్నోగ్రాఫిక్ వెబ్‌సైట్లు, హోస్టింగ్ సంస్థలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, వ్యాపార లిస్టింగ్ సైట్లు, గూగుల్, యు ట్యూబ్ వంటి మధ్యవర్తి సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. కొన్ని అక్రమ మెర్చండైజ్ లిస్టింగ్‌లు లీగల్ నోటీసుల తర్వాత తొలగించినప్పటికీ, సంబంధిత లింకులు , ప్రకటనలు ఇంకా ఇంటర్నెట్‌లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు.ఈ నేపథ్యంలో కోర్టు ప్రతివాదులందరికీ సమన్లు జారీ చేసి, వారి సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించింది. ఒక వెబ్‌సైట్ లో కంటెంట్ తొలగించిన తర్వాత కొత్త URLలు, వెబ్‌సైట్లు మళ్లీ వస్తున్నందున డైనమిక్ ఇంజంక్షన్ ఇవ్వాలని నటుడి తరఫు అభ్యర్థించారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

ప్రతివాదుల సమాధానాలు అందిన తర్వాత, నాగ చైతన్య వ్యక్తిత్వ హక్కులను అనధికారిక వాణిజ్య వినియోగం ఆన్‌లైన్ దుర్వినియోగం నుంచి ఎంతవరకు రక్షించవచ్చో కోర్టు మరింత వివరంగా కోర్టు పరిశీలించనుంది…ఈ కేసు సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులు, డిజిటల్ దుర్వినియోగం AI కంటెంట్ నియంత్రణపై ముఖ్యమైన తీర్పుకు దారి తీయవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

Follow Us