Daggubati Rana: రానా నాయుడుపై విమర్శలు.. వారికి క్షమాపణలు చెప్పిన రానా.. ఒంటరిగానే చూడాలని రిక్వెస్ట్‌

|

Mar 12, 2023 | 8:25 PM

దగ్గుబాటి హీరోలు వెంకటేశ్‌, రానా కలిసి నటించిన మొదటి వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. మార్చి 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ విడుదలైంది. క్రైమ్‌, యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌కు పాజిటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. అంతే నెగెటివ్‌ టాక్‌ వస్తోంది

Daggubati Rana: రానా నాయుడుపై విమర్శలు.. వారికి క్షమాపణలు చెప్పిన రానా.. ఒంటరిగానే చూడాలని రిక్వెస్ట్‌
Rana Naidu
Follow us on

దగ్గుబాటి హీరోలు వెంకటేశ్‌, రానా కలిసి నటించిన మొదటి వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. మార్చి 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ విడుదలైంది. క్రైమ్‌, యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌కు పాజిటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. అంతే నెగెటివ్‌ టాక్‌ వస్తోంది. అడల్డ్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. అలాగే ఇప్పటివరకు ఫ్యామిలీ హీరోగా పేరున్న వెంకటేశ్‌ ఇందులో యథేచ్చగా బూతులు మాట్లాడడం కొందరికి నచ్చడం లేదు. దీంతో రామానాయుడుపై నెట్టింట భారీగా ట్రోల్స్‌ వస్తున్నాయి. రానా- వెంకీ నుంచి ఇలాంటిది ఊహించలేదని.. ఫ్యామిలీతో కలిసి దీన్ని చూడలేకపోతున్నామంటూ పోస్టులు షేర్‌ అవుతున్నాయి. అయితే టాక్‌ ఎలా ఉన్నప్పటికీ విడుదలైన రెండు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లోకి రామానాయుడు చేరింది. భారత్‌ టాప్‌ ట్రెండింగ్‌ షోల్లో ‘రానా నాయుడు’ సిరీస్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది నెట్‌ఫ్లిక్స్‌. దీనిపై స్పందించిన రానా.. ‘రానా నాయుడు సిరీస్ ను విమర్శిస్తున్న, అసహ్యించుకుంటున్న వారికి క్షమాపణలు చెప్పారు. అదే సమయంలో తమ సిరీస్ కు ఇంతటి ఆదరణ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.

ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి రానానాయుడు సిరీస్‌ను చూడవద్దని మరోసారి విజ్ఞప్తి చేశాడు రానా. ఇది ‘ఏ’ రేటెడ్ సినిమా అని, 18 ప్లస్ వయసు వారికేనని పేర్కొన్నారు. కాగా స్ట్రీమింగ్‌కు ముందే రానానాయుడు సిరీస్‌ ఎలా ఉండబోతుందో రానా, వెంకటేశ్‌ ఇద్దరూ హింట్‌ ఇచ్చారు. ముఖ్యంగా ప్రీమియర్‌ షో సమయంలో మాట్లాడిన వెంకటేశ్‌.. ‘ మీ ఇంట్లో ల్యాప్‌ ట్యాప్ లు, ఫోన్లలో దీన్ని చూస్తుంటే మీ ఫేస్ లో ఎక్స్ ప్రెషన్లు పూర్తిగా మారిపోతుంటాయి. ఎందుకంటే ఇందులో కామెడీ, హింస, సెక్స్ కూడా ఉన్నాయి’ అని చెప్పారు. ఇలా చెప్పినప్పటికీ ఈ రేంజ్‌లో అడల్డ్‌ కంటెంట్‌ ఉంటుందని జనాలు ఊహించలేకపోయారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో రానానాయుడుపై ట్రోల్స్ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.