Tollywood: ముట్టుకుంటే మాసిపోతుందేమో.. డాడీ మూవీ బాలనటి ఇప్పుడు ఎలా ఉందంటే..?
డాడీ మూవీలో చిరంజీవి కుమార్తెగా నటించిన ఈ పాపను గుర్తుపట్టారా..? తను ఇప్పుడు ఎలా ఉందో చూస్తే బిత్తరపోతారు. హీరోయిన్లను మించిన అందం.. సో క్యూట్ అనేలా లుక్స్.. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి...
మెగాస్టార్ చిరంజీవి.. ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో ఆయన నటించిన డాడీ సినిమా ఎప్పటికీ ఓ క్లాసిక్. 2001లో విడుదలైన ఈ సినిమాను జనం బాగా ఆదరించారు. సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో చిరంజీవికి జోడీగా సిమ్రాన్ నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. కాగా ఈ సినిమా స్టోరీని రైటర్ భూపతిరాజా.. చిరింజీవికి చెప్పినప్పుడు.. వెంకటేష్ అయితే ఈ స్టోరీకి బాగా సెట్ అవుతాడని సూచించారట. కానీ రైటర్ మాత్రం.. మీరు చేస్తేనే వెరైటీగా ఉంటుందని కన్విన్స్ చేశారట. అలా సినిమా పట్టాలెక్కింది. ఇక మూవీలో చిరు కుమార్తెగా నటించిన పాప గుర్తుందా..?. సినిమాలో ఈ పాపకు, చిరుకు మధ్య వచ్చే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆ స్థాయిలో సినిమాలో ఎమోషన్ వర్కువుట్ అయింది.
అయితే ఆ పాప ఎవరు..? ఇప్పుడు ఎలా ఉంది..? సినిమాలు చేస్తోందా..? అని కొందరు నెట్టింట సెర్స్ చేస్తున్నారు. ఆ చిన్నారి ఇప్పుడు యంగ్ ఏజ్‌కు వచ్చేసింది. హీరోయిన్స్ కూడా చిన్నబోయేలా.. ముట్టుకుంటే మాసిపోతుందా అన్నంత అందంగా ఉంది. ఇంతకీ తన పేరు చెప్పలేదు కదా… అనుష్క మల్హోత్రా.
ముంబైకు చెందిన ఈ పాప.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలిసిన వారి ద్వారా చిరంజీవితో కలిసి సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. చిన్నప్పుడు క్యూట్ లుక్‌తో మెప్పించిన ఈ చిన్నది ఇప్పుడు.. ఫుల్ గ్లామర్ మోడ్‌లోకి మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. సోషల్ మీడియాలోనూ పెద్ద యాక్టీవ్ ఏం కాదు. ఈ బ్యూటీఫుల్ క్యూటీ ఇప్పుడు ఎలా ఉందో దిగువన ఫోటోలో చూడండి…
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.