Soubin Shahir: వారెవ్వా.. కొత్త కారు కొన్న కూలీ నటుడు.. ఎన్ని కోట్లు ఉంటుందంటే..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా కూలీ. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు లయాళీ నటుడు సౌబిన్ షాహిర్.

Soubin Shahir: వారెవ్వా.. కొత్త కారు కొన్న కూలీ నటుడు.. ఎన్ని కోట్లు ఉంటుందంటే..
Soubin Shahir

Updated on: Aug 17, 2025 | 10:59 AM

కూలీ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు సౌబిన్ షాహిర్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్, ఆమీర్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఆగస్ట్ 14న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా అన్ని వర్గాల అడియన్స్ నుంచి ఈచిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే.. కూలీ సినిమాలోని మోనికా స్పెషల్ పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు సౌబిన్ షాహిర్. ఇందులో పూజా హెగ్డేకు పోటీగా స్టెప్పులతో అదరగొట్టేశారు. తాజాగా ఈ నటుడు కొత్త కారును కొన్నారు.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈకారు విలువ రూ.3.30 కోట్లు ఉంటుందని సమాచారం. తన కుటుంబంతో కలిసి అతడు ఈ కారుతో ఫోటోస్ తీసుకున్నాడు. సౌబిన్ షాహిర్.. మలయాళంలో ఫేమస్ హీరో. అలాగే దర్శకుడిగా, నిర్మాతగానూ రాణిస్తున్నారు. 2024లో సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మెల్ బాయ్స్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

ఇక ఇప్పుడు కూలీ సినిమాతో రజినీకి మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇందులో కీలకపాత్రలో నటించిన సౌబిన్.. ముఖ్యంగా మోనిక పాటతో మరింత పాపులర్ అయ్యారు. ఇందులో సౌబిన్ స్టెప్పుల గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సౌబిన్ డ్యాన్స్ వీడియోసో తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?