AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: నానితో ఉన్న ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో చూశారా.? అందాలతో సెగలే

చైల్డ్ ఆర్టిస్టులు ఒకప్పుడు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా ఫ్యాన్స్‌లో యమా క్రేజ్. అన్ని ఇండస్ట్రీలలోనూ ఇదే తంతు. ఆ కోవకు చెందిన ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా.. ఈ స్టోరీలో ఓ సారి చూసేద్దాం. మరి లేట్ ఎందుకు లుక్కేయండి. ఆ వివరాలు..

Actress: నానితో ఉన్న ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో చూశారా.? అందాలతో సెగలే
Tollywood
Ravi Kiran
|

Updated on: Aug 17, 2025 | 10:56 AM

Share

చైల్డ్ ఆర్టిస్టులుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా క్రేజ్ తెచ్చుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. ఆ కోవకు చెందిన ఓ నటి ఈమె. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత క్రేజీ హీరోయిన్‌గా, హాలీవుడ్ స్థాయికి వెళ్లింది ఈ భామ. ఆమె మరెవరో కాదు అవంతిక వందనపు. మన తెలుగు అమ్మాయి.. హాలీవుడ్‌లో క్రేజ్‌తో పాటు తెగ పాపులారిటీ సంపాదించింది. 2016లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి, మనమంతా లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇవన్నింటి కంటే అవంతిక నటించిన ‘ఫార్చ్యూన్ ఆయిల్’ యాడ్ తెగ పాపులర్ అయ్యింది.

హైదరాబాద్ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు మకాం మార్చేసిన ఈ బ్యూటీ.. ‘స్పిన్’ అనే మూవీతో హాలివుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2021లో ‘బూమిక’ అనే తమిళ చిత్రంలో నటించగా.. ఆపై ‘మొక్సి’, ‘సీనియర్ ఇయర్’, ‘మీన్ గర్ల్స్’, ‘తారోట్’ లాంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అమెరికన్ సిరీస్‌లతో నటిస్తూ బిజీగా ఉన్న అవంతిక.. ‘బల్లెరిన ఓవర్‌డ్రైవ్’ అనే సినిమాతో రానుంది. ఈ భామ నటించిన మీన్ గర్స్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కాగా.. ప్రస్తుతం ఈమె వయస్సు 20 ఏళ్లు.. అప్పటి ఫోటోలతో పోల్చుతూ.. ఇప్పుడీమె గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని నెటిజన్లు అంటున్నారు. కాగా, నెట్టింట అవంతిక హాట్ ఫోటోలు వైరల్‌గా మారాయి.

View this post on Instagram

A post shared by avantika (@avantika)

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా