AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అఫీషియల్: వెండితెర ముత్తయ్య మురళీధరన్​గా విలక్షణ నటుడు

త‌న స్పిన్ మాయాజాలంతో ప్ర‌పంచ క్రికెట్‌లో ప‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీలంక లెజెండ‌రీ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్.

అఫీషియల్: వెండితెర ముత్తయ్య మురళీధరన్​గా విలక్షణ నటుడు
Ram Naramaneni
|

Updated on: Oct 08, 2020 | 2:40 PM

Share

త‌న స్పిన్ మాయాజాలంతో ప్ర‌పంచ క్రికెట్‌లో ప‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీలంక లెజెండ‌రీ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్. ఆయ‌న లైఫ్ స్టోరీపై ఓ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా చిత్ర బృందం మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి టైటిల్ రోల్ పోషించనున్నారు. ఈ సినిమాకు ఎమ్.ఎస్. శ్రీపతి దర్శకత్వం వహించనున్నారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం ముర‌ళీ బౌలింగ్ శైలితోపాటు మ్యాన‌రిజ‌మ్స్‌ను విజ‌య్ సేతుప‌తి ప్రాక్టీస్ పడుతున్నారట.

1992-2014 మధ్య లంక తరఫున ఆడిన ముత్తయ్య మురళీధరన్.. వ‌న్డేల్లో ముర‌ళీ 534 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 800 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. 2011లో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాక వివిధ టీ20 టోర్నీల్లో ముర‌ళీ ఆడాడు. అనంత‌రం కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ప్ర‌స్తుతం అతను ఐపీఎల్ జ‌ట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు స్పిన్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

Vijay Sethupathi will play Sri Lankan spinner Muttaiah Muralidaran in the latter's biopic.